రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఆగిపోయింది. రెండున్నర సంవత్సరాల నుంచి షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ సినిమాకు దానయ్య రు. 450 కోట్ల బడ్జెట్ పెట్టారు. వడ్డీలు చాలానే అయ్యాయ్. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదాలు పడింది. మరోవైపు బయ్యర్లు అడ్వాన్స్‌లు ఇచ్చి ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం బయ్యర్ల నుంచి దానయ్యపై విపరీతమైన ప్రెజర్ ఉంది. అయితే రాజమౌళి మాత్రం తాను అనుకున్న స్థాయి వసూళ్లు రావాలని కసితో ఉన్నారు.
అందుకే రెండు సార్లు వాయిదా వేయించాడు. ఈ సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేయాలని దానయ్య చాలా పంతంతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే తాను అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావని రాజమౌళి డిసైడ్ అయిపోయారు. అందుకే ఈ సినిమాను మళ్లీ వాయిదా వేయించారు. ఇక ఇప్పుడు బయ్యర్లు అడ్వాన్స్‌లు ఇచ్చేయడంతో నిర్మాత దానయ్యపై వడ్డీ భారం పడింది. అన్నింటికి మించి ఆర్ ఆర్‌కు రు. 180 కోట్ల ఫైనాన్స్ ఉంది.
అయితే ఇప్పుడు ఆ ఒత్తిళ్లు కూడా దానయ్యపై విపరీతంగా ఉండడంతో రాజమౌళి ఆ భారం మోస్తానని ముందుకు వచ్చాడట. అంతే కాదు ఆ ఫైనాన్స్‌కు తాను హామీ ఉంటానని.. సంతకం పెట్టినట్టు తెలుస్తోంది. సహజంగా పెద్ద సినిమాల నుంచి ఫైనాన్షియర్ల ఒత్తిడి ఉండదు.. అందులోనూ రాజమౌళి సినిమాపై అస్సలు ఉండదు. డబ్బులు చాలా సేఫ్ అన్న నమ్మకం ఉంటుంది.
అయితే రాజమౌళి దానయ్య టెన్షన్ తగ్గించేందుకే తాను ఆ హామీ తీసుకున్నాడని అంటున్నారు. రాజమౌళి బిగ్ రిస్క్ చేసినట్టే అనుకోవాలి. ఇక చిరు ఆచార్య విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆచార్య రిలీజ్ డేట్ వాయిదా పడింది. మాట్నీ ఎంటర్టైన్‌మెంట్ ప్రెజర్ తగ్గించేందుకే ఆ సినిమా ఆర్థిక లావాదేవీలు అన్ని దర్శకుడు కొరటాల శివ తీసుకున్నాడు. దర్శకులు ఈ బాధ్యతలు తీసుకోవడం ఇండస్ట్రీకి మంచి పరిణామమే అని చెప్పాలి.