Moviesపూరీకి ఛార్మి అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా..ఓపెన్ గా చెప్పేసిన...

పూరీకి ఛార్మి అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా..ఓపెన్ గా చెప్పేసిన కొడుకు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మంచి దర్శకుడిగా పేరు పొందిన పూరీ జగన్నాథ్.. ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణీ అవుతున్న ఎంతోమంది హీరోలకు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు సరైన టైంలో హిట్ ఇచ్చి మంచి స్టార్ హీరోలుగా తీర్చిదిద్ది వాళ్ల కెరీర్ ను మలుపు తిప్పాడు. ఇంతటి ఘనత చరిత్ర ఉన్న పూరీ జగన్నాథ్ కు ప్రస్తుతం అన్నీ ఫాల్ప్ సినిమాలు పడుతున్నాయి.

ఇక పూరీ జగన్నాథ్ ఎంతో మంది హీరోలకు మంచి మంచి సక్సెస్లను ఇచ్చినప్పటికీ , తన కొడుకు ఆకాష్ పూరీ కి మాత్రం ఇప్పటివరకు ఒక విజయాన్ని కూడా అందించలేకపోవదం గమనార్హం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలను చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరిద్దరూ ముంబైలో కలసి ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినా నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు డైరెక్టర్ పూరీకి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఒకానోక టైంలో పూరీ తన భార్యకు విడాకులు ఇచ్చేసి ఛార్మీని పెళ్ళి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు హల్ చల్ చేసాయి.

అయితే ఇలాంటి వార్తల పై పరోక్షంగా స్పందించాదు పూరీ కొడుకు ఆకాష్ పూరీ. ఆంధ్ర పోరి అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ మంచి విజయాన్ని అయితే సాధించలేకపోయాడు కానీ నటన పరంగా మంచి మార్కులే వేయించుకున్నాడు ఆకాష్. ఆకాష్ హీరోగా నతించిన రొమాంటిక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి గురించి ఆకాష్ పూరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

“ఛార్మీ గారు చాలా మంచి వారు. చాలా టాలెంట్ ఉంది. మా నాన్న ఛార్మి గారికి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. నాన్నకు ఛార్మీ చాలా సపోర్టివ్ గా ఉంటారు.. ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడక్షన్ ఫీల్డ్ లో చాలా ప్రొఫెషనల్ గా ఆలోచిస్తారు.. నాన్న డైరెక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రతిసారి.. నిర్మాణ రంగంలో ఛార్మి గారు బాగా హెల్ప్ చేస్తారు.. మంచి స్నేహ బంధం ఉంది కాబట్టే మా నాన్న ఛార్మీని వదలరు” అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news