కొత్త సంవత్సరం వేడుకలు వస్తున్నాయంటే చాలు ఎంతో మంది క్రేజీ హీరోయిన్లు, మోడల్స్ ఆ న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను క్యాష్ చేసుకునేందుకు కాచుకుని ఉంటారు. అర్ధరాత్రి కొత్త సంవత్సరానికి వెల్కం చెపుతూ జరిగే వేడుకల్లో ఆడిపాడినందుకు గాను వారికి బాగానే డబ్బులు ముడతాయి. అయితే కొందరు సీనియర్ హీరోయిన్లు, ఛాన్సుల కోసం వెయిట్ చేసే భామలు అయితే భారీ అమౌంట్ డిమాండ్ చేయడం కామన్ అయిపోయింది. ప్రతి యేడాది ఈ తంతు మామూలుగా జరుగుతోంది.
అయితే ఈ యేడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఆడిపాడినందుకు గాను స్టేజ్ షోల్లో దుమ్ము రేపిన ముద్దుగుమ్మలు భారీగానే బ్యాంక్ బ్యాలెన్స్ వెనకేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త సంవత్సరం వేడుకల్లో ఆడిన ముద్దుగుమ్మల్లో ఎవరి రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఉందో తెలుసుకుందాం. హాట్ ముద్దుగుమ్మ సన్నీలియోన్ ఒక్క రాత్రికి గాను ఓ టాప్ హీరోయిన్‌కు ఓ సినిమాకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే తీసుకున్నట్టు టాక్ ?
డిసెంబర్ 31వ తేదీ రాత్రి బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో సన్నీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇక ఆమెకు భారీగా ముట్టచెప్పిన నిర్వాహకులు కూడా ఆమె పేరు చెప్పి భారీ రేట్లకు టిక్కెట్లు కూడా అమ్మేశారు. అయితే ఈ ఒక్క రాత్రి ఇచ్చిన ప్రదర్శనకు గాను సన్నీ రు. 3 కోట్లు తీసుకుందట. ఇక మిల్కీబ్యూటీ తమన్నా విజయవాడ – గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్లో ఆ రాత్రి తన ప్రదర్శనతో వీక్షకులను మత్తెక్కించింది.
ఇందుకు గాను ఆమె రు. కోటి తీసుకుందట. ఇక ఇదే ఈవెంట్లో తమన్నాతో పాటు మెహారీ, పైసా వసూల్ భామ కైరా దత్ కూడా పాల్గొన్నారట. వీరికి ఒక్కొక్కరికి రు. 30 లక్షలు పైనే ముట్టిందట. ఇక అందచందాలు ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనక్కు తగ్గని పూనమ్ పాండే వేసే డ్యాన్స్‌కు రు. 30 లక్షలు ఇచ్చారట. ఇక వెటరన్ ముద్దుగుమ్మ శ్రియా చరణ్ కూడా ఒక్క రాత్రి వంపుసొంపుల ప్రదర్శనకు రు. 30 లక్షలు ఇచ్చినట్టు టాక్ ? ఏదేమైనా ఈ ముద్దుగుమ్మలు ఒక్క రాత్రి ప్రదర్శనతో బాగానే వెనకేసుకున్నారు.