కన్నడ కస్తూరి సౌందర్య సావిత్రి తర్వాత మరో సావిత్రి అంత పేరు తెచ్చుకుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్యను తెలుగు జనాలు తమ ఇంటి ఆడపడుచుగా చూసుకున్నారు. పదేళ్లకు పైగా ఆమె తెలుగు సినిమాను ఏలేసింది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అటు కోలీవుడ్‌లోనూ సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన హిట్ సినిమాలు చేసింది. సౌత్ సినిమాలో ఓ వెలుగు వెలిగింది.
చక్కని అందమే కాదు.. తిరుగులేని అభినయం కూడా ఆమె సొంతం. ఎన్ని పాత్రలు చేసినా సౌందర్య ఏ రోజు పరిధి దాటలేదు. ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ మెచ్చేలా ఆమె పాత్రలు ఉండేవి. ఎన్నో సినిమాల్లో సౌందర్య చీరకట్టుతోనే కనిపించేది. మోడ్రన్ డ్రెస్సులు వేసినా కూడా ఎప్పుడూ అశ్లీలత, అసభ్యతకు చోటు ఇవ్వలేదు. నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సౌందర్యకు ఓ కోరిక ఉండేదట. అదే దర్శకత్వం వహించాలని.. ఆ కోరిక తీరకుండానే సౌందర్య 2004లో హెలీకాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందింది.
బాలయ్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నర్తనశాల రెండో షెడ్యూల్ సమయంలో ఆమె మృతి చెందారు. ఇక సౌందర్య చివర్లో గెలుపు అనే సినిమాలో నటించింది. షూటింగ్ పూర్తయినా కూడా ఆ సినిమాను రిలీజ్ చేయలేదు. రు. 25 వేల రెమ్యునరేషన్ నుంచి రు. 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి సౌందర్య ఎదిగారు.
ఇక ఆమె చివరి సినిమా గెలుపు డిస్ట్రిబ్యూషన్ విషయంలో తలెత్తిన విబేధాల వల్లే రిలీజ్ కాలేదని అంటారు. ఇక సౌందర్య తన సొంత బావనే వివాహం చేసుకున్నారు. ఆమె మరణాంతరం అతడు మరో వివాహం చేసుకున్నాడు. సౌందర్య చనిపోయేనాటికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టింది.