ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వాతావరణం నెలకొందో ప్రత్యేకించించెప్పనవసరం లేదు. అనుకోని సమయంలో వర్షం పడి చేతికి రావాల్సిన పంట నాశనమైతే రైతులు ఎంత ఇబ్బందులు పడతారో..దాని వల్ల ఎంత నష్టపోతారో..ప్రజెంట్ టాలీవుడ్ లో ని పెద్దల పరిస్ధితి..ప్రోడ్యూసర్స్ పోజీషన్ కూడా అలానే ఉంది. మూడు నాలుగు సంవత్సరాలు కష్ట పడి కొన్ని కోట్లు పోసి సినిమా తీస్తే..కరెక్ట్ గా ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో జగన్ టికెట్ల రేట్లను తగ్గించారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ డిలా పడిపోయింది.
ఇక అదే టైంలో చిరంజీని టార్గెట్ చేసిన్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా చిరంజీవి మాట్లాడిన మాటలు కొందరిని హర్ట్ చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు రావడంతో.. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఇక అక్కడ మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి..” పెద్దరికం చేయడం నాకిష్టం లేదు, నేను పెద్దగా ఉండను.. కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తాను. ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను.. ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటా..” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఆయన ఆ మాటలు అన్న కొద్ది గంటలకే మొహన్ బాబు బహిరంగా లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో మోహన్ బాబు..”మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా.. నా మౌనం చేతకానితనం కాదంటూ మోహన్ బాబు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం నలుగురు హీరోలు నలుగురు ప్రొడ్యూసర్లు నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని కొన్ని వేల ఆశలు కొన్ని వేల కుటుంబాలు కొన్ని జీవితాలు అని అన్నారు. అందరం కలిసి సినిమాను బతికిద్దాం.
రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి మనకు న్యాయం చేయాలని అడుగుదాం. మా అందరికీ నిర్మాతలు దేవుళ్లు. కానీ ఈరోజు నిర్మాతలు ఏమయ్యారు. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు.’ అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతో మోహన్ బాబు పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేసిన్నట్లు అర్ధమౌతుంది. ఇక కొంతమంది అయితే చిరంజివి అలా మాట్లాడి ఉండకూడదు అంటూ పరోక్షంగానే కౌంటర్లు ఇస్తున్నారు.
కలిసి సినిమాని బతికిద్దాం pic.twitter.com/i6Z421REqA
— Mohan Babu M (@themohanbabu) January 2, 2022