Moviesఎన్టీఆర్ ' దాన వీర శూర క‌ర్ణ ' కు బ‌డ్జెట్‌తో...

ఎన్టీఆర్ ‘ దాన వీర శూర క‌ర్ణ ‘ కు బ‌డ్జెట్‌తో పోలిస్తే 15 రెట్లు లాభాలు.. క‌ళ్లు చెదిరే లెక్క‌లు..!

టాలీవుడ్ లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సాంఘిక పాత్రలతో… పాటు పౌరాణిక పాత్రలు వేయడం లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఈ రోజుకు కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక కృష్ణుడు.. ఒక రాముడు… ఒక దుర్యోధనుడు అంటే మన కళ్ళముందు ఎన్టీఆర్ పోషించిన పాత్రలే గుర్తుకువస్తాయి. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం పౌరాణిక పాత్రలు అంటే మనకు ముందుగా ఎన్టీఆర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ కు ఈ విషయంలో సాటిరాగల హీరో ఎవరైనా ఉంటారా ? అంటే కనుచూపుమేరలో ఆన్సర్ కనిపించదు.

ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో దానవీరశూరకర్ణ ఒక‌టి. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాను ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై సొంతంగా నిర్మించారు. అంతే కాదు ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడంతో పాటు దుర్యోధనుడు – కర్ణుడు – కృష్ణుడిగా మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ – హరికృష్ణ ఇద్దరు కూడా ఈ సినిమాలో నటించారు. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఎన్టీఆర్ తన జీవితంలో ఎప్పటికైనా పూర్తిస్థాయి కర్ణుడు పాత్ర చేయాలని నిర్ణయానికి వచ్చేశారు. ఆ కోరికను ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాతో నెరవేర్చుకున్నారు.

అప్ప‌ట్లో రు. 20 ల‌క్ష‌ల‌తో తీసిన ఈ సినిమాను మూడు సార్లు రిలీజ్ చేశారు. రు. 20 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో తీసిన ఈ సినిమా 15 రెట్లు ఎక్కువుగా లాభాలు తీసుకువ‌చ్చింది. అప్ప‌ట్లోనే రు. 3 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూల్లు రాబ‌ట్టింది. నాలుగు గంట‌ల‌కు పైగా నిడివితో అప్ప‌ట్లో 25 రీల్స్‌తో తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే కాకుండా.. భార‌త‌దేశ సినిమా చ‌రిత్ర‌లోనే పెద్ద సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.

విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ర‌చ‌న‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అంత పొడ‌వు ఉన్నా ఎక్క‌డా ప్రేక్ష‌కుల‌కు విసుగు లేకుండా ఎన్టీఆర్ త‌న న‌ట‌న‌, దర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో మెస్మ‌రైజ్ చేశారు. 9 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సెకండ్ రిలీజ్‌లో కూడా 100 రోజులు ఆడింది. అస‌లు ఈ రికార్డు ఏ సినిమాకు లేదు.

ఈ సినిమాకు పోటీగా ఇదే మ‌హాభార‌త క‌థ‌తో సూప‌ర్‌స్టార్ కృష్ణ హీరోగా క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కురుక్షేత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అర్జునుడిగా కృష్ణ, కృష్ణుడుగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణం రాజు నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతం ఇచ్చారు. రెండు సినిమాలు పోటాపోటీగా వ‌చ్చాయి. అయితే క‌ర్ణ ప్ర‌భంజ‌నం ముందు కురుక్షేత్రం నిల‌బ‌డ‌లేక ప‌రాజ‌యం పాలైంది.

ఇక సంక్రాంతి త‌ర్వాత జ‌న‌వ‌రి 24న రంభ ఊర్వశి మేనకా మూవీ రిలీజయింది. మురళీమోహన్, నరసింహరాజు కీలక పాత్రల్లో న‌టించ‌గా రావుగోపాలరావు – రోజారమణి కూడా ప్రధాన పాత్రలు పోషించారు. పి.సాంబ‌శివ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా కూడా దాన‌వీర‌శూర క‌ర్ణ ప్ర‌భంజ‌నం ముందు నిల‌బ‌డ‌లేక ప‌రాజ‌యం పాలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news