మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా గత రెండు సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. రెండేళ్ల నుంచి అనేక కారణాలతో ఈ సినిమా సెట్స్ మీదే ఉంది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. రామ్‌చరణ్ – మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాకు వడ్డీలతో కలిపి భారీ వ్యయమే అయ్యిందని అంటున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివకు కూడా ఈ సినిమాలో వాటా ఉంది. వాస్తవానికి పోస్టర్లపై కొణిదెల ఎంటర్టైన్‌మెంట్ – మ్యాట్నీ సంస్థల పేర్లు కనిపిస్తున్నా.. లాభనష్టాల్లో కొరటాలకు కూడా భాగం ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తోన్న మాట.
ఇక సినిమా ప్రొడక్షన్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కొరటాల శివే చూస్తున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూర్తిగా చేతులు మారిందట. మ్యాట్నీ సంస్థకు ఈ సినిమాకు డీల్ క్లోజ్ అయినపోయిందని అంటున్నారు. మ్యాట్నీ వాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చేసి కొరటాల మెత్తం సెటిల్ చేసేసుకున్నాడట. ఇక ఇప్పుడు ఈ సినిమా లాభాలు, నష్టాల్లో బాధ్యత అంతా కొరటాలదే.
సినిమాకు లాభం వస్తే మొత్తం కొరటాల చేతుల్లోకి వెళుతుంది. అదే నష్టం వచ్చినా మనోడే జేబులోనుంచి తీసి ఇస్తాడట. అసలు ఆచార్య ఈ యేడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా దెబ్బతో కొరటాల కరెక్టు టైం కోసం చాలా రోజులు వేచి ఉండడంతో పాటు ఫిబ్రవరి 4న రిలీజ్ చేయాలని పూర్తిగా తానే నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ సినిమా నిర్మాతలకు ఇష్టం లేకపోయినా కొరటాల నాలుగైదు నెలల నుంచి హోల్డ్ చేస్తూ వస్తున్నాడట.
వడ్డీలు కూడా చాలా పెరిగిపోయాయని తెలుస్తోంది.అందుకే కొరటాల మ్యాట్నీ వాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చేసి పూర్తిగా ప్రాజెక్టు టేకాఫ్ చేశాడని అంటున్నారు. ఇక కొరటాలకు డిస్ట్రిబ్యూషన్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. ఇప్పటికే ఓ సారి డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం ఏర్పాటు చేసి బిజినెస్ లెక్కలు అడిగి.. మరీ ఫిబ్రవరి 4న డేట్ ఫిక్స్ చేశాడట.