స్టార్ హీరో సినిమా అంటే కచ్చితంగా కొన్ని కమర్షియల్ హంగులుండాల్సిందే.. టీజర్ దగ్గర నుండి రిలీజ్ థియేటర్ల దాకా రికార్డుల లెక్క చూసుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు స్టార్ హీరో అంటే మాస్ ఇమేజ్ తోనే సినిమాలు చేయాలని చూస్తారు. అయితే అందుకు భిన్నంగా వారి ఇమేజ్ ను పూర్తిగా పక్కనపెట్టి ఒక్కోసారి ప్రయోగాలు చేస్తుంటారు హీరోలు. ఉదాహరణకి అదుర్స్ లో చారి పాత్ర ఎన్.టి.ఆర్ ఎంత గొప్పగా అభినయించాడో తెలిసిందే. అప్పటికే మాస్ ఇమేజ్ ఉన్న తారక్ అలాంటి పాత్ర చేయడం అంటే అటు ఫ్యాన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆలోచన చేయాలి.
ఇక రీసెంట్ గా దువ్వాడ జగన్నాధంలో శాస్త్రిగా అల్లు అర్జున్ అదరగొట్టేశాడు. డిజెగా శాస్త్రిగా రెండు వేరియేషన్స్ తో పాటుగా శాస్త్రిగా బన్ని కూడా తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అయితే ఒకే తరహా పాత్ర ఇద్దరు స్టార్ హీరోలు చేస్తే వచ్చే చిక్కే డిజె శాస్త్రికి, అదుర్స్ చారిలకు వచ్చింది. పోలిక పెట్టి మా హీరో గొప్పగా చేశాడంటే మా హీరో గొప్పగా చేశాడంటూ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు.
నిజానికి హీరోలు చేసేది ఫ్యాన్స్ కోసమే అయినా.. వారి చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలే తప్ప ఇలా అనవసరపు గొడవలకు దారి తీయకూడదు. అదుర్స్ లో చారి తన పాత్ర పరిధి విధి విధానాలు వేరు. ఇక డిజెలో శాస్త్రి కూడా అంతే. బాడీ లాంగ్వేజ్ ను బట్టి క్యారక్టరైజేషన్ ఎక్స్ పోజర్ అవుతుంది తప్ప మరేం లేదు. ఎవరి పరిధి మేరకు వారి ప్రతిభ ఆవిష్కరిస్తారు అంతేకాని చారిగా మా ఎన్.టి.ఆర్ గొప్ప, శాస్త్రిగా మా బన్ని అని గొప్ప అనుకునే ఫ్యాన్స్ ముందు మన తెలుగు హీరోలు గొప్ప అనుకుంటే బెటర్.