బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ప్రియాంక సినిమాలు చేస్తున్నప్పుడు ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అయితే ఆ సంచలనాలకు మించి ఆమె తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైనా వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మరింత సంచలనం. ప్రియాంక – నిక్ పెళ్లి జరిగినప్పుడు ఈ బంధం ఎక్కువ రోజులు నిలువ దని… వారిద్దరూ కచ్చితంగా విడిపోతారు అన్న అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు. మరి కొందరు నిక్కు అందంతో పాటు ఆస్తి ఉండటంతో వాటికి ఆశపడే అతడిని పెళ్లి చేసుకుందని విమర్శించారు.
అయితే ప్రియాంక చోప్రా కూడా తక్కువదేంకాదు… ఆమె కూడా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టింది. ఇదిలా ఉంటే తమ దాంపత్య జీవితంపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రియాంక – నిక్ బంధం రోజురోజుకు మరింతగా బలపడుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి నిక్ పేరు తొలగించడంతో అందరూ షాకయ్యారు. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
కొద్ది నెలల ముందు సమంత కూడా తన సోషల్ మీడియా ఖాతాలను అక్కినేని పేరు తొలగించింది. ఆ తర్వాత ఎన్నో పుకార్లు వచ్చాయి. చివరకు అవే నిజం అయ్యాయి. సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది. ఇప్పుడు ప్రియాంక కూడా అలాగే చేస్తుందా అని చాలామంది సందేహించారు. అదే సమయంలో వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తాము ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని చెప్పకనే చెప్పారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా అమ్మ మధు చోప్రా తన కుమార్తె దాంపత్య జీవితం పై స్పందించారు. తన అల్లుడు వెరీ గుడ్ అని… చాలా జీనియస్ అని నెమ్మదస్తుడు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇద్దరు చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారని… మీడియాలో వచ్చే వార్తలు ఏవి నమ్మవద్దని చెప్పింది. ఇక తన అల్లుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడని… అన్ని విషయాల్లోనూ అతడికి ఎంతో లోతైన జ్ఞానం ఉందని మురిసిపోయింది. మరి అత్తగారు అల్లుడు గురించి ఇంతలా ఆకాశానికి ఎత్తేసింది అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి ప్రియాంక లక్కీ పర్సనే..!