సినీ ఇండస్ట్రీలో సాయికుమార్ అంటే తెలియని వారంటూ ఉండరు. వాయిస్ పరంగా పాపులర్ అయినా నటనతో కూడా అభిమానులను మెప్పించి ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఈయన డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ..అనేక సినిమాలలో స్టార్ హీరోలకు వాయిస్ డబ్బింగ్ చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎందరో హీరోలకు డబ్బింగ్ చెప్పారు కానీ ముఖ్యంగా రాజశేఖర్ సినిమా అంటే సాయికుమార్ వాయిస్ ఉండాల్సిందే. తెర పై రాజశేఖర్నటన తెర వెనుక సాయి కుమార్ వాయిస్ చేసిన మ్యాజిక్ ఫలితంగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రాజశేఖర్ ఖాతాల్లో పడాయి. ప్రతి సినిమాలో హీరో సాయికుమార్ రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పే వాడు. సెంటిమెంట్ సీన్లలో ఆయన యాక్షన్ సీన్లలో అయినా హీరో సాయికుమార్ రాజశేఖర్ కి డబ్బింగ్ చెబుతూ ఉండేవాడు.
అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్టులలో ఆయనకి తిరుగులేని ఇమేజ్ ఉండేది. కానీ కొంత కాలం తరువాత సాయి కుమార్ రాజశేఖర్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం మానేశాడు. సయికుమార్ హీరోగా మారడానికి ముందు ఆయన చాలామంది హీరోలకు డబ్బింగ్ చెప్పేవారు. రజనీకాంత్ .. రాజశేఖర్ .. సుమన్ వంటి వారికి ఆయన వాయిస్ బాగా సెట్ అయ్యేది. అయితే, హీరో అయిన తరువాత ఆయన ఇతర హీరోలకు డబ్బింగ్ చెప్పడం మానేశారు. అలా చేసి తప్పుచేశానని తాజాగా సాయి కుమార్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు.’
తాజాగా సాయి కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..ఆయన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ..” ‘పోలీస్ స్టోరీ’ తరువాత కొంతమంది సినీ ఇండస్ట్రీ పెద్దలను కలిసినప్పుడు ‘నీకు ఉన్నదే నీ వాయిస్ .. నువ్వు హీరో అయిన తరువాత ఆ వాయిస్ ను అందరికీ ఇస్తే మొనాటినీ అయిపోతుంది .. అలా చేయకు’ అని చెప్పారు. బాగా ఆలోచిస్తుంటే అది తప్పు అని నాకు ఇప్పుడు అర్ధమౌతుంది.
ఎందుకంటే సుమన్ .. రాజశేఖర్ వంటి వారిని నేను ఈ విషయంలో హర్ట్ చేశాను. హీరో రజినీకాంత్ బాషా సినిమాతో పాటూ చాలా సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పాను. వాళ్లు స్టార్స్ అని సాయికుమార్ డబ్బింగ్ చెప్పనని అన్నాడు అంటే వాళ్లకు ఏదోలా అనిపిస్తుంది కదా”.. అంటూ సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన రెమ్యూనరేషన్ గురించిన సంగతులు చెబుతూ.. ఆయన మొదటగా డబ్బింగ్ కోసం రూ.500 తీసుకున్నాని..ఇక అక్కడ నుండి రూ.25వేల వరకూ తీసుకున్నాని సాయి కుమార్ పేర్కొన్నాడు.