సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ గా నెట్టుకురావలంటే చాలా కష్టం. అమదం ఉన్నా టాలెంట్ ఉన్నా అదృష్టం ఉన్నా.. కొన్ని సార్లు మనం అనుకున్నంత స్దాయికి రీచ్ అవ్వలేం. ముఖ్యంగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో కి వచ్చి హీరోయిన్ గా ఎదగట మహా కష్టం. ఇంట్లో వాళ్లు ఒప్పికోకపోయినా..ఎదురించి..పోరాడి..తమ కలను నెరవేర్చుకుందాం అని ఇక్కడ అడుగుపెడితే..అమ్మాయిలకు ఎలాంటి పరిస్ధితులు ఎదురవుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అవకాశం ఇవ్వమని డైరెక్టర్ దగ్గరకు వెల్లితే..ఆయన చూసే వంకర చూపులు..పరోక్షంగా మాట్లాడే డబుల్ మీనింగ్ మాటలు ఆయన ఆమె నుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పకనే చెప్పెస్తారు. అందరు డైరెక్టలు ఇలా ఉంటారు అని చెప్పలేం కానీ..సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఇలానే ఉన్నారంటూ అలా తమను అడిగిన నటులు చెప్పుతుంటే తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ క్యాస్టింగ్ కౌచ్ లిస్ట్ లో బడా బడా స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి బాధలు నేను పడ్డాను అని చెప్పుతుంది నటి తేజశ్విని మదివాడ.
అమ్మడు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్ని సినిమాలో లీడ్ రోల్స్ చేసి..తనదైన స్టైల్లో నటించి కురాళ్ల మతులుపోగోట్టింది. కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో కీలక పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటే ఆమె ఏ ఫోటో పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక తేజశ్వినికి కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక తిప్పలు తప్పలేదట. సినిమాలో నటించడానికి ట్రై చేస్తున్నప్పుడు కొందరి డైరెక్టర్స్ దగ్గరకు వెళ్ళితే..వాళ్లు సిగ్గులేకుండా నాతో పడుకుంటావా అని డైరెక్ట్ గా అడిగేసేవారట.
ఇదే విషయాని ఆమె పలు సందర్భాల్లో మీడియాకు తెలియచేసింది. తెలుగు అమ్మాయిలను డైరెక్టర్లు డైరెక్ట్ గానే కమిట్మెంట్ అడిగేస్తారు అని..అది చాలా చాలా ఈజీ అవుతుందని..కానీ హిందీ అమ్మాయిలను అయితే ఏదో మేనేజర్ల పెట్టి ..మెల్లగా ఏదోలా అడుగుతారు అని చెప్పుకొచ్చింది. ఆమె తెలుగు అమ్మాయి కాబట్టి డైరెక్ట్ గా అడిగేసే వారట దర్శకనిర్మాతలు. ఇల అలా అడిగినప్పుడు తేజశవిని ఆన్ కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదట. ఇది ఈమె ఒక్కరి బాధనే కాదు సినిమా ఇండస్టృఈలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్లాబ్లం. దీనికి అంతం ఎప్పుడో ఆ దేవిడికే తెలియాలి.