భారతదేశ సినిమా రంగంలో గత నాలుగైదు సంవత్సరాలుగా కాస్టింగ్ కౌచ్ అనే పదం బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు, నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయట పెడుతున్నారు. అయితే ఈ ఆరోపణల్లో అన్నీ నిజాలు ఉన్నాయా లేదా ? అన్నది పక్కన పెడితే ఈ తరహ వార్తలు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అన్న పదం బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే సౌతిండియాలో స్టార్ హీరోగా ఉన్న సీనియర్ హీరో అర్జున్ సైతం లైంగిక ఆరోపణలు ఎదుర్కోక తప్పలేదు.
కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన అర్జున్ తెలుగులోనూ మంచి హీరోగా గుర్తింపు పొందారు. 1980 – 90 వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అర్జున్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా గుర్తింపు పొందారు. అయితే పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలో సెంటిమెంట్ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవల కాలంలో అర్జున్ నెగటివ్ పాత్రలు… విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను అర్జున్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు అర్జున్ లైంగికంగా వేధించారని ఆరోపించింది. ఈ ఆరోపణ అప్పట్లో కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే… కాకుండా సౌత్ సినిమా పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది. చాలామంది అర్జున్ అలాంటి వ్యక్తి కాదని… ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. దీనిపై అర్జున్ స్పందిస్తూ తాను ఎప్పుడూ మహిళలను చాలా గౌరవిస్తానని…. ఎప్పుడు ఎవరిని లైంగిక వేధింపులకు గురి చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు.
తాను దర్శకత్వం వహించిన సినిమాలలో సన్నివేశాలు వివరిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరిని అయినా ఒక మాట అంటే అని ఉండొచ్చు గాని… వ్యక్తిగతంగా ఉద్దేశించి ఎవరిని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అర్జున్ వివరణ ఇచ్చుకున్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసినందుకు అర్జున్ హీరోయిన్ శృతిపై ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. అయితే కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
అయితే ఆ తర్వాత శృతికి సినిమా అవకాశాలు రాలేదు. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు దర్శక నిర్మాతలు ఎవరు సినిమా అవకాశాలు ఇవ్వలేదని వాపోయింది. దీంతో ఆమె ప్రస్తుతం వెబ్సీరిస్లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. కన్నడంలో హిట్ అయిన ఎంఎక్స్ ప్లేయర్ వెబ్సీరిస్లో ఆమె నటించింది.