సినిమారంగంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం.. డేటింగ్లు చేసుకోవడం… పెళ్లి చేసుకోవడం కొన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశాక విడిపోవడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే 2017లో చాలామంది టాప్ హీరో, హీరోయిన్లు విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు. ఈ యేడాది విడాకులు తీసుకున్న హీరో, హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
ఆమీర్‌ఖాన్ – కిరణ్‌రావు:
2021లో దేశం మొత్తాన్ని ఊపేసిన వార్త అమీర్ ఖాన్ – కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకోవడం. లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ఏర్పడిన పరిచయంతో తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్‌ను ఆమీర్ పెళ్లి చేసుకున్నాడు. 2006లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడిపోయింది. ఫాతిమా సనా షేక్ తో డేటింగ్లో ఉండటంతోనే ఆమీర్ కిరణ్ కు విడాకులు ఇచ్చాడని వార్తలు గుప్పుమన్నాయి.
నాగచైతన్య – సమంత:
ఇక టాలీవుడ్‌ను ఒక కుదుపు కుదిపేసింది సమంత – నాగచైతన్య విడాకుల వార్త. వీరి విడాకులు ఇప్పటికీ వార్తల్లోనే ఉంటున్నాయి. 2017 లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేశాక విడిపోయారు. అసలు వీరిద్దరూ ఎందుకు ? విడిపోయారో ? ఇప్పటికీ చాలామందికి తెలియదు.
నుస్రత్ జహాన్ – నిఖిల్ జైన్:
ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ – బెంగాల్ పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్ పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో వీరు విడాకులు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ ఎంపీ గెలిచిన నుస్రత్ ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వార్తలతో మీడియాలో ఉంటున్నారు. ఈ జంట పెళ్లికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు.. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
కీర్తి కుల్హారి – సాహిగల్ సెహగల్:
ఇక మరో నటి కీర్తి కుల్హారి – సాహిగల్ సెహగల్ పెళ్లి చేసుకుని ఐదు సంవత్సరాలు కాపురం చేశాక… ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. 2016లో వీరి పెళ్లి జరిగింది.
నిషా రావల్ – కరణ్ మెహ్రా:
నిషా రావల్, తన భర్త కరణ్ గృహహింసకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు అతడికి మరో మహిళతో సంబంధం ఉందని ఆరోపించడంతో వీరిద్దరు విడిపోయారు.