సినిమాల్లో కొన్ని కాంబినేషన్లు ఎంత సెట్ చేద్దాం అనుకున్నా జరగవు. కొన్ని ఏం అనుకోకుండా, పెద్ద కష్టపడకుండానే జరిగిపోతాయి. సినిమాలో కొన్ని కాంబినేషన్స్ భళే ఉంటాయి. హీరో-హీరోయిన్లు కానివ్వండి, డైరెక్టర్-హీరో కానివ్వండి, హీరో-విలన్ ల కాంబినేషన్ కానివ్వండి తెర పై కనిపిస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్క అని డిసైడ్ అయిపోతారు అభిమానులు.అలా కుదిరితే చూడటానికి రెండు, మూడు జతల కళ్లు ఉన్నా సరిపోవు. కొన్ని కాంబినేషన్స్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా ఉంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ మన తెలుగులో చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా బోయపాటి శ్రీను-బాలకృష్ణ, అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్-అల్లు అర్జున్, రాజమౌళి-ప్రభాస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అలా ఆసక్తి రేపిన కాంబినేషన్స్‌లో నందమూరి ఎన్టీఆర్ , డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం 1, సింహాద్రి , యమదొంగ చిత్రాలు బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసాయి. దీంతో వీళ్ల కాంబినేషన్ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ ను ఎవరూ చూపించని కొత్త కోణంలో రాజమౌళి స్క్రీన్‌పై చూపించారు. ఇప్పుడు ఈ కాంబో మరోసారి తెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రంతో మళ్ళీ ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే ఒక్కప్పుడు తారక్ బొద్దుగా ఉండేవాడు. బొద్దుగా ఉన్నా కూడా డ్యాన్స్ బాగా చేసేవాడు. అప్పట్లో చాలా మంది డైరెక్టర్స్ కూడా ఇదే విషయాని ఓపెన్ గా చెప్పేవారు. అయితే ఎన్టీఆర్ తో అప్పటికే రెండు సినిమాలు చేసిన రాజమౌళి యమదొంగ కధను ఆయనకు చెప్పినప్పుడు..ఈ సినిమా నీతో చేయాలి అంటే నువ్వు నీ బరువును తగ్గించుకోవాలి అని చెప్పాడట. రాజమౌళి మాటంటే వేదవాక్కు గా భావించే జూనియర్ ఎన్టీఆర్ మరో మాట ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పారట.
అంతలా ఆయనకు యమ దొంగ స్టోరీ నచ్చేసిందట. ఇక తను అనుకుంటే అది ఖచ్చితంగా సాధించి తీరుతా అని మరోసారి ప్రూవ్ చేసాడు తారక్. అందుకే అంటారు తనకు తగ్గ వాడు చెప్తేనే ఎవరైనా విని దానిని తప్పకుండా ఆచరిస్తారు అని… అంతే ఎన్టీఆర్ ఆ సలహాను ఛాలెంజ్ గా తీసుకొని తన బరువును దాదాపు 30 కిలోలు తగ్గించుకున్నాడు. ఆ సమయంలో కొన్ని ఇంటర్వ్యూలలో “దరిద్రం పోయింది” అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించటం ఒక కొసమెరుపు.