బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 2లో మెరిసిన భానుశ్రీ.. డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీటాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాను.. హాట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. బిగ్‌బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన భామ భాను శ్రీ.. అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటి అభిమానులను సంపాదించుకుంది. ఏడు చేపల కథతో ఈ భామ టాలీవుడ్ అభిమానుల్లో సెగలు పుట్టించింది. జబర్ధస్త్ లో అప్పుడప్పుడు మెరిసెస్ ఈ బ్యూటీ పలు ఈవెంట్స్ లో కూడా పాల్గోంటూ బాగా డబ్బు సంపాదిస్తుంది.
అద్దిరిపోయే డ్యాన్స్ చేయగలికే ఈ అమ్మడు లుక్స్ పరంగా కూడా అందరిని ఆకట్టుకుంటుంది. కానీ రీజన్ ఏంటో తెలియదు ఆమెకు మంచి సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేస్తున్నా కూడా ఆఫర్స్ రాకపోవడం గమనార్హం. అయితే రీసెంట్ గా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ వార్తలపై ఈ హాట్ యాంకర్ స్పందించి.. వాటినన్నిటిని ఖండించింది.
సినిమాల్లో నటించాలని ఇంట్లో అమ్మ నాన్నలకు ఇష్టం లేకపోయిన వరంగల్ నుండి వచ్చి హైదరబాద్ లో ఉంటున్న భాను..కెరీర్ స్టార్టింగ్ లో అసలు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడిందట. ఇక అలాంటి టైంలోనే భానుకు తన బాయ్ ఫ్రెండ్ హెల్ప్ చేసాడట. భాను సిటీకి వచ్చిన కొత్తలో ఎక్కడ ఉండాలో తెలియక చేతిలో డబ్బులు లేక ఓ జ్యూస్ సెంటర్ లో పడుకునేదట.
ఇక సినిమాలో అవకాశాల కోసం ఆమె ఎంతో ట్రై చేసిందట. కానీ ఆఫర్స్ రాలేదట. చిర్వరికి అమ్మ నాన్నలను కూడా సినిమా కోసం వదిలేసుకుని దూరంగా వచ్చిందట. ఆపదలో ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయం చేసిన నా బాయ్ ఫ్రెండ్…నాకు కష్టసుఖాల్లో కూడా తోడు ఉన్నాడు అని చెప్పుకొస్తూ నన్ను పెంచిన అమ్మానాన్నల కంటే… నాకు అతనే ఎక్కువ అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ యాంకర్.