నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మూడో వీకెండ్‌లో కూడా బాక్సాఫీస్ దగ్గర అఖండ జోరు చూపించడం విశేషం. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప థియేటర్లలో ఉన్నా కూడా.. ఆ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు కూడా రు.46 లక్షల షేర్ అఖండ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.
కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా కానీ అఖండ జోరుకు మాత్రం బ్రేకులు లేవు. కలెక్షన్లు మాత్రం ఎక్కడా డ్రాఫ్ అవ్వకుండా స్టడీగా ఉంటున్నాయి. ఇక 16వ రోజు 29 లక్షల షేర్ రాబట్టిన అఖండ అనూహ్యంగా 17వ రోజు రు. 46 లక్షల షేర్‌తో దూసుకు పోయింది. ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ మాత్రమే.
ఇక ఇప్పటికే అఖండ రు. 12 కోట్లకు పైగా లాభాలతో దూసుకు పోతోంది. ఏపీలో టిక్కెట్ల రేట్లు పెంచి అమ్మి ఉంటే అఖండ లాభాలు మొత్తంగా రు. 30 కోట్ల పైనే ఉండేవని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అఖండ 17 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 18.58 కోట్లు
సీడెడ్ – 14.19 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.78 కోట్లు
ఈస్ట్ – 3.89 కోట్లు
వెస్ట్ – 3.24 కోట్లు
గుంటూరు – 4.48 కోట్లు
కృష్ణా – 3.39 కోట్లు
నెల్లూరు – 2.45 కోట్లు
—————————————–
ఏపీ + తెలంగాణ = 56 కోట్లు (షేర్)
91.80 కోట్లు ( గ్రాస్)
—————————————–
కర్నాటక + రెస్టాఫ్ ఇండియా – 4.66 కోట్లు
ఓవర్సీస్ – 5.28 కోట్లు
———————————————
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ = 65.94 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ = 114.15 కోట్లు
——————————————-