పుష్ప – ది రైజ్ రెండేళ్ల నుంచి ఊరించి ఊరించి ఎట్టకేలకు ఈ రోజు థియేటర్ల లోకి దిగింది. గతంలో బన్నీ – సుక్కు కాంబోలో 2004 లో ఆర్య సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. ఆ తర్వాత మరోసారి ఇదే సినిమా కు సీక్వెల్ గా 2010లో ఆర్య 2 సినిమా వచ్చింది. ఈ సినిమా మరీ సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా జస్ట్ ఓకే అనిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ 11 సంవత్సరాల తర్వాత బన్నీ – సుక్కు కాంబినేషన్ లో పుష్ప సినిమా వచ్చింది.
బన్నీ గత సినిమా అల వైకుంఠపురం లో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో చూశాం. సుకుమార్ దర్శకత్వం లో 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు అన్నింటిని తిరగ రాసింది. ఇక సుక్కు చివరి సినిమా రంగస్థలం సూపర్ హిట్. ఆ తర్వాత మనోడు సినిమా చేయలేదు. మూడున్నర సంవత్సరాల పాటు సుక్కు ఈ సినిమా కోసమే పని చేశాడు.
ఇక ఇప్పుడు పుష్పకు సుక్కు చివరి సినిమా రంగస్థలం కు మధ్య కంపేరిజన్ స్టార్ట్ అయ్యింది. ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సుకుమార్ రంగస్థలాన్ని ఓ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దాడడు. పుష్ప విషయంలో కూడా దానినే ఫాలో అయినట్టుగా ఉంది. చాలా వరకు రంగస్థలం స్టైల్లోనే సినిమా నడిపించిన సుక్కు ఎంగేజింగ్ విషయంలో రంగస్థలం లో సగం అంచనాలే అందుకున్నాడు.
సినిమా చాలా టైం వేస్టు సీన్లు ఉన్నాయి. అసలు ఇంటర్వెల్ మినహా హై పాయింట్స్ ఎక్కడా కనపడవు. క్లైమాక్స్ కూడా నిరాశ పరిచేలా ఉంది. ఇక రంగస్థలంలో చరణ్ పాత్ర పై సానుభూతి ప్రేక్షకుడికి ఉంటుంది. అయితే పుష్ప లో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో ఎంత బాగా చేసినా ఆ ఫీల్ మనకు కనిపించదు.
సెకండాఫ్, క్లైమాక్స్ సీన్లు సినిమాకు పెద్ద మైనస్ అయిపోయాయి.
ఇక సునీల్‌ను మనం ఇప్పటి వరకు కామెడీ హీరోగానే చూశాం. అయితే ఈ సినిమాలో సరికొత్త సునీల్‌ను చూస్తాం. మళయాళ హీరో ఫహాద్ ఫజిల్‌ను మళయాళ మార్కెట్ కోసమే పెట్టారు అనిపించింది. తొలి భాగంలో అతడి పాత్ర జీరో. మరి సెకండాఫ్‌లో అతడి పాత్రకు స్కోప్ ఉంటుందేమో ? చూడాలి. ఇక అనసూయను రంగస్థలంలో పెట్టాం కదా ? ఆ హిట్ సెంటిమెంట్‌తో మాత్రమే ఇక్కడ పెట్టాలని బలవంతంగా ఆమె పాత్ర ఇరికించినట్టుగా ఉంది. ఆమె పాత్ర వేస్టు.. వేస్టున్నర. ఓవరాల్ గా రంగస్థలం రేంజ్ సినిమా అయితే పుష్ప కాదు.