టాలీవుడ్ లో ఇప్పుడు అంతా యంగ్ యాంకర్ల రాజ్యం నడుస్తుంది. అయితే రెండు దశాబ్దాల క్రితం తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఉదయభాను. అప్పట్లో బుల్లితెరపై ఆమె ఒక వెలుగు వెలిగింది. ఉదయభాను ఆ తర్వాత ఝాన్సీ మధ్య మంచి పోటీ ఉండేది. ఉదయభాను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు. కొన్నేళ్ల పాటు యాంకర్‌గా చాలా బిజీ గా కొనసాగిన ఉదయభాను పెళ్లి తర్వాత ఇప్పుడు యాంకరింగ్‌కు దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు మాత్రమే ఆమె బయటకు వస్తోంది.
ఉదయభాను చాలా రోజుల తర్వాత అఖండ సక్సెస్ మీట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ బాలయ్య బాబు లాంటి మహానుభావుడిని తాను ఇండస్ట్రీలో చూడలేదని.. ఎవ్వరు ఏమనుకున్నా.. తనకు ఎవ్వరూ మరో షో ఇవ్వకపోయినా పర్వాలేదని.. బాలయ్య బాబుకు ఎవ్వరూ సాటిలేరని ఉదయ భాను చెప్పింది. హ్యాట్సాప్ బాలయ్య మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.. మిమ్మలను దగ్గరగా చూసిన వారు ఎవ్వరైనా మీకు గుండెల్లో గుడి కడతారని ఆమె చెప్పింది.
ఇక తనకు పిల్లలు పుట్టక ముందు ఈవెంట్లతో బిజీగా ఉండేదానిని అని.. ఏదైనా ఈవెంట్ ఉంటే దానికి బాలయ్య గారు అందరికంటే ముందుగా వచ్చేవారు.. మిగిలిన హీరోల్లా కాకుండా ఎలాంటి హడావిడి లేకుండా కూర్చునేవారు.. వారు రిక్వెస్ట్ చేస్తే చాలు చివరి టెక్నీషియన్‌కు గిఫ్ట్ ఇచ్చేవరకు ఉండి మరీ వెళ్లేవారు అని ఉదయభాను బాలయ్యను ఆకాశానికి ఎత్తేసింది.
తాను ఇలా ఎన్నోసార్లు కూర్చొని బాలయ్య బాబుకు థ్యాంక్స్ సార్ అని చెప్పాను.. తనపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయని.. అయినా ఐ డోన్ట్ కేర్ అని.. బాలయ్య బాబుకు అభిమానులు అయ్యాక దేనికి అయినా సిద్ధంగా ఉండాలని ఉదయ భాను సంచలన విషయాలు బయట పెట్టింది. ఇక ఉదయభానుకు బాలయ్య అంటే పిచ్చ అభిమానం. ఉదయభాను ఇద్దరు పిల్లల బర్త్ డే ఫంక్షన్‌కు బాలయ్యను స్వయంగా ఆహ్వానించింది. ఆ ఫంక్షన్‌కు బాలయ్య వచ్చాడని ఆమె ఎన్నోసార్లు మురిసిపోయి… బాలయ్యను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది.