Movies పూరి జగన్నాధ్, కళ్యాణ్ రామ్ ల ఇజం ట్రైలర్... అరాచకం...

పూరి జగన్నాధ్, కళ్యాణ్ రామ్ ల ఇజం ట్రైలర్… అరాచకం అసలు!!

పూరీ జగన్నాథ్ సినిమా అంటేనే పవర్ ఫుల్. ఆయన ఏ మూవీ తీసినా.. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో పాటు తనదైన స్టైల్ ఉంటుంది. లేటెస్ట్ గా ఆయన కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 29న రిలీజ్ కాబోతున్న మూవీ టీజర్ ఇవాళ రిలీజైంది.
మూవీ టీజర్ దుమ్మురేపింది. బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్న విజువలైజేషన్ ఆకట్టుకుంటోంది. అలాగే కళ్యాణ్ రామ్ ఆహార్యం కూడా బాగుంది. ఇందులో కళ్యాన్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్టు క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ పేరు బాలకృష్ణ.  టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి.

 

కళ్యాణ్ రామ్ తో పాటు.. జగపతిబాబు కూడా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. టీజర్ లో కూడా జగపతి బాబు విజువలైజేషన్ రిచ్ గా ఉంది. ఇక హీరోయిన్ అధితి ఆర్యా కూడా మంచి రోల్ ఇచ్చినట్లే కనబడుతోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ దీనికి మరో ప్లస్ పాయింట్

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news