తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ కు ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దగ్గుబాటి రామనాయుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన తందైన స్టైల్లో సినిమాలో చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైయ్యారు. నిజం చెప్పాలంటే కుటుంబ కధ చిత్రలల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ తో రిలేషన్ బాగా ఉందని చెప్పవచ్చు. ఈయన సినిమాలకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు. ఇక అప్పట్లో హీరో శోభన్ బాబు తరువాత ఇప్పుడు వెంకటేష్ ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
రీసెంట్ నారప్ప, దృశ్యం 2 సినిమాలతో హిట్ అందుకున్న వెంకీ దాదాపుగా 80కి పైగా సినిమాలలో నటించి అభిమానుల మనసులల్లో ఓ ప్రతేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఈయన ఎన్నో విభిన్నమైన సినిమాలు తీస్తూ ఘన విజయాలను అందుకుంటున్నాడు. సినీ ఇండస్ట్రీ లో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సక్సెస్ కావడం చాలా కష్టము. కానీ వాటన్నిటినీ అవలీలగా ఛేదించాడు వెంకటేష్. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా మారిపోతూ నేటి తరం ప్రేక్షకులను కూడా మాయ చేస్తున్నాడు ఈ విక్టరీ హీరో.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వెంకటేష్.. మంచి మంచి హిట్స్ అందుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు ఈయన సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. కానీ పట్టుదలతో ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు .. ఎప్2 తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ వైపు స్టార్ హీరోగా రాణిస్తూనే.. మరోవైపు సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగానూ వెంకీ తన సత్తా చూపిస్తున్నారు .
40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయనకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయో అని చాలా మంది లెక్కలు కడుతుంటారు. పైగా హైదరాబాద్‌లో ఈయన ఇంటిని చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇంద్రభవనంలా తన ఇంటిని నిర్మించుకున్నాడు వెంకీ. తన అన్నయ్య సురేష్ బాబు సలహా మేరకు బిజినెస్‌తో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులుగా వెంకటేష్ పెట్టారని తెలుస్తుంది. వెంకటేష్, సురేష్ బాబు ఇద్దరి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అంతా కలుపుకొని ఇప్పటికి వీళ్ళ ఆస్తి 3250 కోట్ల వరకు ఉందని సమాచారం. కానీ తన తండ్రి నుంచి వచ్చే ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయట అవన్నీ కలుపుకుంటే..7000 పై మాట అని ఉన్నట్లు తెలుస్తుంది.