Moviesస‌మంత ఆవేద‌న వెన‌కాల ఏం జ‌రుగుతోంది..!

స‌మంత ఆవేద‌న వెన‌కాల ఏం జ‌రుగుతోంది..!

ప‌దేళ్ల పాటు సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని ఏలేసింది స‌మంత రూత్ ప్ర‌భు. అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో ప్రేమ వివాహం.. ఆ త‌ర్వాత నాలుగేళ్ల పాటు కాపురం.. ఎంతో అన్యోన్యంగా ఎంతోమందికి ఆద‌ర్శంగా ఉన్న ఈ జంట ఒక్క‌సారిగా విడిపోవ‌డం అంద‌రిని క‌లిచి వేసింది. విడాకుల త‌ర్వాత చైతు, స‌మంత ఎవ‌రికి వారు త‌మ సినిమా జీవితంపై ఫుల్‌గా ఫోక‌స్ పెట్టేశారు. ఎవ‌రి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. స‌మంత కూడా పుష్ప‌లో ఐటెం సాంగ్‌తో మొద‌లు పెట్టి, శాకుంతలంతో పాటు బాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది.

విడాకుల త‌ర్వాత కూడా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉన్న ఆమె విడాకుల గురించి ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే ఇప్పుడు మాత్రం చాలా లోతైన వ్యాఖ్య‌లు చేస్తోంది. ఆమెలో ఉన్న బాధ‌ను ఇప్ప‌టి వ‌ర‌కు అణిచిపెట్టుకుని వ‌స్తోంద‌ని.. ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోన్న కోట్స్ చెపుతున్నాయి. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి వ‌స్తోన్న రూమ‌ర్ల‌ను ఖండిస్తూనే ఎన్నో అనుమానాల‌కు క్లారిటీ ఇస్తోంది.

ఇక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 2021లో జ‌రిగిన త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల త‌ర్వాత త‌న జీవితం ఎలా ? ఉంటుందో ? త‌న‌కు ఎలాంటి అంచ‌నాలు లేవ‌ని చెప్పింది. తాను ఎంతో జాగ్ర‌త్త‌గా వేసుకున్న ప్లాన్స్ అన్ని కుప్ప‌కూలిపోయాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మీకు జీవితంలో చెడు రోజులు వ‌చ్చినా.. మీ ప‌ని మ‌ధ్య‌లో ఆగిపోయినా కూడా దానిని వెంట‌నే అంగీక‌రించ‌మ‌ని చెప్పింది.

స‌మ‌స్య‌ల‌పై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాల‌ని చెప్పిన స‌మంత‌.. ఇంకా నా జీవితం ఎంతో గ‌డ‌పాల్సి ఉంద‌ని అనుకోవాల‌ని చెప్పింది. ఇక జీవితంలో ఎంతో ప్రేమించిన వ్య‌క్తి నుంచి విడిపోయాక తాను చాలా కుంగిపోయాన‌ని.. చాలా బ‌ల‌హీన ప‌డ్డాన‌ని.. అయితే తాను చ‌నిపోతాన‌నే అనుకున్నాన‌ని.. కానీ ఇప్పుడు తాను ఇలా ఉన్నందుకు గ‌ర్వంగా ఉంద‌ని చెప్పింది. విడాకుల త‌ర్వాత త‌న జీవితంపై వ‌స్తోన్న ట్రోలింగ్‌ల‌కు కూడా ఆమె స్పందించింది.

ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల అభిప్రాయాల‌తో ఉంటార‌ని చెప్పిన ఆమె.. మ‌నం ఒక‌రినొక‌రం ప్రేమించుకోవ‌చ్చ‌ని.. అయితే వారు అభిప్రాయాలు హుందాగా వ్య‌క్తం చేయాల‌ని కోరుకుంటాన‌ని చెప్పింది. ఏదేమైనా వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా క‌ఠిన‌మైన నిర్ణ‌యం త‌ర్వాత కూడా స‌మంత ఆ బాధ‌ను దిగ‌మింగు కుంటూ కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టింది.

స‌మంత తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యానికి కార‌ణాలు ఏవైనా ఆమె చాలా లోతుతో కూడిన బాధ‌ను అయితే వ్య‌క్తం చేస్తోందన్న‌ది ఆమె మాట‌లు చెపుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news