యువరత్న నందమూరి బాలకృష్ణ తన తాజా సినిమా అఖండతో బాక్సాఫీస్ దగ్గర గర్జన చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో అఖండ బ్రేక్ ఈవెన్‌కు చేరిపోయింది. అయితే బాలయ్యకు కొన్ని ఏరియాల్లో ముందు నుంచి వీక్ మార్కెట్ నడుస్తోంది. నైజాం, ఓవర్సీస్‌లో బాలయ్య సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా ఆ స్థాయిలో వసూళ్లు అయితే రావు. అయితే ఇప్పుడు అఖండ ఆ బ్యాడ్ సెంటిమెంట్లను కూడా బ్రేక్ చేసి మరీ వసూళ్లు సాధిస్తోంది. బాలయ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రతో పాటు సీడెడ్‌లో ఎప్పుడూ కింగే. ఈ ఏరియాల్లో బాలయ్య సినిమాలకు భీభత్సమైన ఆదరణ ఉంటుంది.
గత కొన్నేళ్లలో బాగా ఆడిన బాలయ్య సినిమాలకు కూడా నైజాంలో తక్కువ వసూళ్లే వచ్చాయి. అలాగే మిగిలిన ఏరియాలతో పోలిస్తే నైజాంలో కూడా బాలయ్య సినిమాకు తక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అఖండ ఆ ట్రెండ్‌ను మార్చేస్తోంది. ఈ సినిమాకు నైజాంలోనే మిగిలిన ఏరియాలను మించి మరీ రెస్పాన్స్ వస్తోంది. అసలు ఆ రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందంటంటే ఫస్ట్ వీకెండ్‌కే అఖండ బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి వచ్చేసింది.
అఖండ నైజాం రైట్స్ రు. 10.5 కోట్లకు అమ్మారు. తొలి రోజే ఇక్కడ రు 4.4 కోట్ల షేర్ వచ్చింది. రెండో రోజు రు 4.5 కోట్ల షేర్ వస్తే మూడో రోజుకే అఖండ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి వచ్చేసింది. ఇప్పటికే అక్కడ అఖండ షేర్ రు. 12 కోట్లకు దగ్గరిలో ఉంది. ఐదో రోజు వసూళ్లు కూడా కలిపితే ఇది మరింత పెరగనుంది. ఇక్కడ కూడా అఖండను బాలయ్య మార్కెట్‌కు మించి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని థియేటర్లను ఎత్తేశారు.
మిగిలిన సినిమాలకు రెస్పాన్స్ లేకపోవడంతో ఆ సినిమాను ఎత్తేసి మరీ అఖండను తిరిగి ప్రదర్శిస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో కూడా ఇప్పటికే అఖండ వన్ మిలియన్ మార్క్‌కు చేరువ అయ్యింది. ఇక్కడ కూడా బాలయ్య సినిమాలకు ముందు నుంచి వసూళ్లు తక్కేవే ఉంటాయి. ఏదేమైనా బాలయ్యకు కలసిరాని ఏరియాల్లో కూడా అఖండ దుమ్ము దులుపుతోంది.