మంగ్లీ..లేటేస్ట్ సింగింగ్ సెన్సేషన్. తెలుగులో సినీ రంగంలోనే కాకుండా.. యూ ట్యూబ్ లోనూ, ఇటు బుల్లితెర మీద ఫోక్ సింగర్‌గా మంగ్లీ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మంగ్లీ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ సాంగ్ పాడినా కూడా యూ ట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఆమె పాట అంటే ఇష్టపడని జనం ఉండారు. ఆమె పాడుతుంటే మనకు తెలియకుండానే మనం డ్యాన్స్ చేయగలం. అలాంటి ఊపు తెప్పిస్తాయి మంగ్లీ పాటలు.
ఇక ఆమెకు ఉన్న స్పేషల్ ఏంటంటే మంగ్లీ పాడిన ఏ సాంగ్‌కు అయినా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ రావడంతో పాటు వచ్చే పాపులార్టీ కూడా మామూలుగా ఉండదు. ఇటు బుల్లితెర మీద మంగ్లీ పాల్గొన్న, చేసిన ప్రోగ్రామ్స్‌కు అయినా తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే మంగ్లీ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లోనే పాటలు పాడిన మంగ్లీ ఇప్పుడు తమిళంలో ను తన గొంతును వినిపించబోతుందట. ఇక నుంచి తమిళ ప్రేక్షకులను కూడా తన ఓఅటలతో హుషారెత్తించబోతుంది మన మంగ్లీ.
కోలీవుడ్ ప్రజలను ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు మంగ్లీ రెడీ అవుతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తమిళ హీరోలు జీవా, మిర్చి శివ నటిస్తోన్న చిత్రంతో మంగ్లీ సింగర్‌గా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ లో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఆరుళ్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే మంగ్లీతో చెన్నైలోని స్టూడియోలో పాటను కూడా రికార్డు చేశారట మేకర్స్. ఇక ఆ పాట విన్న చిత్రబృందం మంగ్లీ వాయిస్ కు ఫిదా అవ్వడంతో..మరో పాటను కూడా పాడించబోతున్నట్లు తెలుస్తుంది.