టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతూ టాప్ 1 లో ఉన్న సమంత భార్యగా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అక్కినేనివారింట కోడలిగా కాళ్లు పెట్టిన సమంత..ఆ అక్కినేని ట్యాగ్ ను ఎక్కువ కాలం తన పేరు పక్కన ఉంచుకోలేకపోయింది. ఖచ్చితంగా ఇది కారణమంటూ తెలియదు కానీ నాగచైతన్య సమ్మత్ తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేస్తూ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఇదే విషయాని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేసారు.
ఇక అప్పటినుండి సమంత మీడియా ముందు కు రాలేదు. తాను ఏం చెప్పాలి అనుకున్న సోషల్ మీడియా ద్వారానే తెలియజేసింది కానీ నేరుగా మీడియాతో మాట్లాడలేదు. కాగా విడాకుల మ్యాటర్ నాగచైతన్య ని ఎవరు తప్పు పట్టలేదు. అందరూ సమంతదే తప్పు..సమంతకి వేరొకరితో ఎఫైర్ ఉంది. సమంత అక్కినెని ఫ్యామిలీ పరువు తీస్తుంది.పెళి తరువాత అమత వల్గర్ గా నటించడం ఏంటి అంటూ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని చూయిస్తూ పాయింట్ అవుట్ చేసారు. కానీ సమంత ఏం రెస్పాండ్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉంది.
కాగా డైవర్స్ తరువాత ఫస్ట్ టైం ఒక ప్రఖ్యాత మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి రెస్పాండ్ అయ్యింది సమంత. విడాకులపై ముందుగా తన మాటలతో అందరూ అంగీకరిస్తారని అనుకోవడం లేదని చెప్పిన సమంతా.. అందరూ తన కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలని తాను డిమాండ్ చేయనని క్లారిటీ ఇచ్చింది. ఎవరికి వారికి వారి సొంత అభిప్రాయాలు ఉంటాయని. అలా ఉండకూడదని కూడా తాను అనుకోనని చెప్పుతూ ..కానీ మనం చేసే పని ఆమోదయోగ్యంగా ఉండాలని ..ఆ విషయాని గుర్తు పెట్టుకోవాలని చెప్పింది.