యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమా నిన్న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అఖండ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే అందరూ అనుకున్నారు. ఈ అంచనాలకు తగినట్టుగానే అఖండ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే వరల్డ్ వైడ్ గా రు. 54 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి రోజు ఏపీలో టిక్కెట్ల రేట్లు తక్కువ ఉన్నా.. చాలా చోట్ల బెనిఫిట్ షోలు లేకపోయినా కూడా అఖండ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల గర్జన లేపింది. తొలి రోజు అఖండకు ఏపీ, తెలంగాణలో రు 15.39 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రు. 23 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.
ఏరియాల వారీగా అఖండ తొలి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 4.39 కోట్లు
సీడెడ్ – 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.36 కోట్లు
వెస్ట్ – 96 లక్షలు
గుంటూరు – 1.87 కోట్లు
కృష్ణా – 81 లక్షలు
నెల్లూరు – 93 లక్షలు
——————————–
ఏపీ + తెలంగాణ = 15.39 కోట్ల షేర్
గ్రాస్ = 23 కోట్లు
——————————–
విచిత్రం ఏంటంటే బాలయ్య సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో అఖండ తొలి రోజు కేవలం రు. 81 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. కృష్ణాతో పోల్చుకుంటే చాలా తక్కువ మార్కెట్ ఉన్న నెల్లూరు జిల్లాలో రు. 93 లక్షలు వచ్చింది. ఇక గుంటూరులో అయితే అఖండ గర్జన క్రియేట్ అయ్యింది. అక్కడ అఖండకు రు. 1.87 కోట్ల షేర్ వచ్చింది. నైజాం, సీడెడ్ వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి.