ఎన్టీఆర్‌గా… ఆంధ్రులు ముద్దుగా పిలుచుకునే అన్నగా ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం కేవలం నందమూరి తారకరామారావుకు మాత్రమే దక్కింది. ఇక ఆయన కేవలం సినీ ఇండస్ట్రీ లో ఉండే కార్మికులను మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎంతో మంది ప్రజలను ఆదుకున్న గొప్ప మానవతావాది. ఇక సినిమాలలో నందమూరి తారకరామారావుకు ఎంత క్రేజ్ అయితే ఉందో రియల్ లైఫ్ లో కూడా ఆయనకు అంతే క్రేజ్ వుంది. రాజకీయంగా కూడా ఆయన్ను తెలుగు ప్రజలు ఆదరించి పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనం.
ఇదిలా ఉంటే ఓ సీనియర్ నటుడు తనను ఎన్టీఆర్ కాపాడారు అని చెప్పారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు. కామెడీ పాత్రలు చేయడానికైనా, ఎమోషనల్ సీన్ పండించడానికైనా, విలనిజం చూపించడానికి అయినా ఆయనకు ఆయనే సాటి అన్నట్టుగా ఉంటారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అన్న గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి సీఎం అవ్వాలని, మరోవైపు పేద ప్రజలకు సహాయం చేయాలనే ఆకాంక్షతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారట. ఈ సమయంలో చలపతిరావు అన్న గారిని కలిసారట. ఆయనతో మీరు పార్టీ పెట్టారు కదా..! మేము కూడా మీతో పాటు నడవాలని అనుకుంటున్నాము.. రాజకీయాల్లోకి రావచ్చా అని అడిగిరట.
ఆ వెంటనే ఎన్టీఆర్.. మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు.. రాజకీయాలంత దరిద్రం మరొకటి ఉండదు. ఇక సినిమాల్లోనే మంచి మంచి పాత్రలు వేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవండని చెప్పారట. రాజకీయం అనే ఒక ఊబిలోకి మీరు ఎప్పటికీ రావద్దు.. మన వాళ్ళందరికీ కూడా చెప్పండి అంటూ ఎన్టీఆర్ గారు సలహా ఇచ్చారు అని చలపతిరావు తెలిపారు.