యావత్ తెలుగు సినిమా పరిశ్రమ చూపు అంతా ఇప్పుడు అఖండ సినిమాపైనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకుని రెండు నెలలు దాటుతోంది. అయితే ఇప్పటి వరకు థియేటర్లలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఏదీ రాలేదు. దీంతో అందరి అటెంక్షన్ బాలయ్య నటిస్తున్న అఖండ మూవీ పైనే ఉంది.
యువరత్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో శ్రీకాంత్ నటించారు. జగపతిబాబు – పూర్ణ – కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన అఖండ సినిమా హడావుడి నిన్నటి నుంచే మొదలైపోయింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మారిన నియమాల ప్రకారం ఏ సినిమాకు కూడా బెనిఫిట్స్ వేయడానికి వీలు లేదు.
దాంతో నందమూరి అభిమానులకు బాలయ్య అఖండ విషయంలో నిరాశ తప్పలేదు. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి ఆంక్షలు ఏం లేవు. ప్రభుత్వం కొత్త నియామాలు ఏం విధించలేదు. దాంతో హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతులు తెచ్చుకున్నారు నిర్వాహకులు.
డిసెంబర్ 2న తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్‌లో బెనిఫిట్ షోస్ వేసారు. ఇక ఇక్కడ ఒక టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. టికెట్ ధర ఏకంగా రూ 3500 నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. అయినా కూడా నందమూరి అభిమానులు పర్లేదు థియేటర్‌లో అఖండ కు మాస్ జాతర జరగాల్సిందే అంటున్నారు.