కోకిలతో పోటీపడే గొంతు ఆమెది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మైపారపించిన గాయని .. ఆమె ఎవరో కాదు శ్రేయ ఘోషాల్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించింది ఈ భామ. ఇండియన్‌సింగర్‌గా రాణిస్తున్న శ్రేయా ఘోషల్ సింగర్‌గా నాలుగు జాతీయ అవార్డులందుకున్నారు. 2015 సంవత్సరంలో శ్రేయా ఘోషల్ వివాహం జరిగింది. తన స్నేహితుడు, బిజినెస్‌మెన్ శైలాదిత్యను ఆమె పెళ్లాడింది. వివాహం తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న శ్రేయా.. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ పలువురి ప్రశంసలందుకుంటోంది.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ ఈ స్టార్ సింగర్ కు క్షమాపనలు చెప్పింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు ఇంతకు ఆమె శ్రేయా ఘోషల్ కు ఎందుకు సారీ చెప్పిందో తెలుసా..?
తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న సారా అలీ ఖాన్ అక్కడ ‘ఆత్రంగి రే’ సినిమాలోని ‘చకా చక్’ పాటను పాడారు. దీంతో అక్కడే ఉన్న ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. వాళ్లలో మరింత జోష్‌ను నింపారు సారా అలీ ఖాన్.
నిజానికి ఈ సినిమాలో చకాచక్ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. దీంతో సారా అలీఖాన్ పాటను పాడిన తర్వాత.. శ్రేయా ఘోషల్‌కి నవ్వుతూ.. క్షమాపణలు తెలిపారు. మీ అంత బాగా పాడలేకపోతున్నా.. అంటూ చమత్కరించారు. బాలీవుడ్ సినిమా ‘ఆత్రంగి రే’లోని ఫస్ట్‌సాంగ్ ‘చకా చక్’ పాట ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉన్న చీర ధరించి మంచి స్టెప్పులేస్తూ అదరగొట్టారు.