స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం కాగా రెండో భార్య లక్ష్మీపార్వతి. మొదటి భార్య బసవతారకంను ఎన్టీఆర్ 1942లో వివాహం చేసుకున్నారు. ఈమె ఎవరో కాదు ఎన్టీఆర్ మేనమామ కూతురు. అయితే దురదృష్టవశాత్తు క్యాన్సర్ వ్యాధితో 1985లో ఆమె మరణించింది. ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం కాగా..అందులో 8 మంది కుమారులు.. నలుగురు కూతుళ్ళు. సీనియర్ ఎన్టీఆర్ పేద కుటుంబం నుంచి వచ్చి ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ పొందడం వెనుక .. ఆయన సతీమణి బసవతారకం ఉన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు, ఆమె పిల్లల పెంపకాన్ని స్వయంగా చూసుకోవడం వల్లే బాలకృష్ణ, రామకృష్ణ , హరికృష్ణ హీరోలుగా మారారు. కుటుంబ సభ్యులకు ఏమాత్రం కష్టం రాకుండా చూసుకోవడమే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆయన భార్య బసవతారకం ఎదురు వచ్చేవారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వివి రాజు మాట్లాడుతూ.. తారకమ్మ ఎంతో మంచిది .. ఇంటికి వచ్చిన వాళ్లకు చాలా రుచికరమైన ఆహారం అందేలా చూస్తూ ఉండే వారు.
కుటుంబ సభ్యుల క్షేమం కోసమే ఆరాట పడుతూ ఉండేవారు . ఇక సెట్‌కి కూడా చాలా అరుదుగా మాత్రమే వచ్చే వారు.. నన్ను కూడా సొంత కొడుకులా చూసుకున్నారు అంటూ దర్శకుడు వెల్లడించారు. నేను ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా ఆమె నేర్పారు.. తారకమ్మ ఎప్పుడూ కూడా సినిమా విషయంలో ఇన్వాల్వ్ అయ్యే వారు కాదు.. ఎన్నో గుప్తదానాలు కూడా చేశారు అని ఆయన వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎనలేని అభిమానం అని మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ముందుగా సహాయం చేసే వారిని, అంతేకాదు ఒక సందర్భంలో ఆర్థిక సహాయం కూడా చేశారు అని ఆయన తెలిపారు.
ఇక ఎన్టీఆర్ షూటింగ్ టైంలో బయట ఆహార పదార్థాలు తినేవారు కాదట. ఎన్టీఆర్ కోసం ఆమె స్వయంగా భోజనం వండి ఇంటినుంచి క్యారేజ్ పంపేవారట. ఎన్టీఆర్ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆమె తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో గైనిక్ క్యాన్సర్‌కు గురయ్యారు. ఆ వ్యాధితోనే ఆమె మృతి చెందారు.