బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌బాస్ 5 చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు మీద ట్వీస్టులి.. కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వారం ఇంటి నుంది ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేసిన రవి మ్యాటర్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. రవి ఎలిమినేషన్ అసలు ఓటింగ్ పరంగా జరగలేదు అని..కావలనే బిగ్ బాస్ కాజల్ ను సేవ్ చేసి రవిని ఎలిమినేట్ చేసారని అభిమానులు మడిపడుతున్నారు.
దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. షోను బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేయడం గమనార్హం. తెలుగు బిగ్‌బాస్ బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని తెలిపారు. దీంతో ఈ విషయం గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరింది.
ఇది ఇలా ఉండగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రవి కి బిగ్ బాస్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఇచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో రవి మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట. వారానికి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట.
అంటే రవి 12 వారాలకు దాదాపు రూ. 80 లక్షల నుంచి రూ. 96 లక్షల వరకు తీసుకుంటున్నట్లుగా టాక్. అంటే బిగ్‌బాస్ విజేతకు అందించే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 12 వారాల్లో ఆయన మొత్తం రెమ్యునరేషన్ దాదాపు రూ.1 కోటికి చేరుకోవడంతోనే .. పోటీదారులలో నుంచి రవిని లిమినేట్ చేసారని అభిమానులు మండిపడుతున్నారు.