శివ శంకర్ మాస్టర్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. శివ శంకర్ మాస్టర్ డ్యాన్స్ చేస్తే సాక్షాత్తు ఆ నటరాజు నే మన ముందు నాట్యం చేస్తున్నాడని భావిస్తారు అభిమానులు. డ్యాన్స్ అంటే ఆయనకు ఎంత ఇష్టమో ఇప్పటికే ఆయన పలి సంధార్భాలల్లో మనకు తెలియజేసారు. డ్యాన్స్ మీద ఉండే ప్రేమతో సినిమా రంగం వైపు అడుగులు వేసి.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని.. పట్టుదలగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
శివ శంకర్ మాస్టర్ కెరీర్ స్టార్టింగ్ లో ప్రముఖ కొరియాగ్రాఫర్లు సలీం, సుందరం లాంటి వారి దగ్గర అసిస్టెంట్ మాస్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత కొరియాగ్రాఫర్‌గా తనదైన శైలిలో రాణించారు. అలా సుమారు నాలుగున్నర దశాబ్దాలు పాటు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆరోగ్యపరంగా బాగున్న ఈయనకు..రీసెంట్ గా కరొనా రావడంటొ ఉపిరితిత్తులు బాగా పాడైపోవడంతో..కరోనాతో పోరాడుతూ మృతి చెందారు.
కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈయన మృతిపట్ల ప్రముఖ నటీనుటుల, హీరోలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
శివ శంకర్ మాస్టర్ మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు గాను ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్నారు. ఈఅయ్న 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేసిన శివ శంకర్ మాస్టర్ మూడు తరాల కథానాయకులతో స్టెప్పులు వేయించారు. నటుడి గానూ కొన్ని మూవిస్ లో నటించి మెప్పించారు. ఇక ఈయన డ్యాన్స్‌మాస్టర్‌గా అందుకున్న రెమ్యునరేషన్ 7.50 రూపాయలట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో శివ శంకర్ మాస్టారే స్వయంగా వెల్లడించారు.