బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలయ్య 2019 వ సంవత్సరంలో నటించిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ సినిమాల తర్వాత లాంగ్ గ్యాప్లో అఖండ వస్తుంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ – లెజెండ్ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
దీంతో అఖండ కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అవుతుందని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను ఉన్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ ప్రకారం చూస్తే అఖండ కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు ముందు బోయపాటి దర్శకత్వం వహించిన దమ్ము డిజాస్టర్ అయ్యింది.
ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీసు ముందు బోర్లా పడింది. దమ్ము ఫ్లాప్ అయ్యాక బోయపాటి కసితో లెజెండ్ సినిమా తీసి హిట్ కొట్టారు. వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ తర్వాత బోయపాటి అఖండ సినిమాను తెరకెక్కించారు. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే అఖండ కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.
రామ్ చరణ్ హీరోగా 2019 సంక్రాంతికి వినయ విధేయ రామ వచ్చి ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బోయపాటి ఇప్పుడు బాలయ్యతో సినిమా చేశారు. ఇక అఖండ ప్రపంచ వ్యాప్తంగా రు. 60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న భారీ సినిమా కావడంతో అఖండ అఖండ జ్యోతిలాటాలీవుడ్ వెలుగులు నింపుతుంది అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.