సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి. వారి సంతానమే మంజుల, మహేష్‌బాబు, రమేష్‌బాబు, ప్రియ దర్శిని. ఆ తర్వాత తనతో చాలా సినిమాల్లో నటించడంతో పాటు మహిళా దర్శకురాలిగా ఉన్న విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటికే విజయనిర్మలకు మరో వ్యక్తితో పెళ్లయ్యింది. విజయనిర్మల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు.
విజయనిర్మల చిన్నప్పుడే సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఆ కారణంతోనే చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిర్మాతగానే కాకుండా దర్శకురాలిగా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.
విజయనిర్మల 1946 ఫిబ్రవరి22న జన్మించారు. ఆమె కెరీర్ ముందుగా ఓ తమిళ్ సినిమాతో స్టార్ట్ అయ్యింది. విజయా ప్రొడక్షన్ వారు ఆ సినిమా నిర్మించారు. అప్పటికే ఇండస్ట్రీలో నిర్మలమ్మ ఉండడంతో వారు నిర్మల పేరుకు ముందు విజయ అని యాడ్ చేశారు. దీంతో నిర్మల కాస్తా విజయ నిర్మల అయ్యారు.
ఆమె తెలుగులో మంచి కుటుంబం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మహిళా దర్శకురాలిగా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆమెదే. ఆమె గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. కృష్ణ నటించిన దేవదాసు సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. ఆమెకు ముందుగా కృష్ణమూర్తి అనే షిప్ ఇంజనీర్‌తో పెళ్లయ్యింది. వీరి సంతానమే నరేష్. అయితే అప్పట్లో ఆమె సినిమాల్లో బిజీగా ఉండడంతో వారిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి.
కృష్ణమూర్తి, విజయనిర్మలపై లేనిపోని అపోహలు పెంచుకోవడంతో పాటు విజయనిర్మలను సినిమాలకు దూరం కావాలని చెప్పాడు. అయితే ఆమెకు సినిమాలపై ఆసక్తి ఎక్కువ. సినిమాలు వదులుకునేందుకు ఆమె ఇష్టపడలేదు. అలా వారి గ్యాప్ పెరగడంతో చివరకు విజయనిర్మల కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చేసింది. తర్వాత కృష్ణను రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే కృష్ణకు భార్య ఉన్నా కూడా కుటుంబం సమ్మతితోనే విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే కృష్ణ కెరీర్ ఎదుగుదలలో విజయనిర్మల పాత్ర చాలా ఉంది.