బాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా వీరిలో గత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది దీపికా పదుకొనే. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకునే కుమార్తె అయిన దీపిక ఓవైపు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతునే… మరోవైపు పలు బిజినెస్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా డబ్బులు సంపాదించే హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో దీపికది టాప్ పొజిషన్.
ఇక కమర్షియల్ సినిమాలు, హీరోల పక్కన పాత్రలు చేయడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానులను దీపిక సొంతం చేసుకున్నారు. దీపిక స్వస్థలం బెంగళూరు. ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయారు. దీపిక మొదట్లో తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.
ఆమె కెరీర్ ప్రారంభంలో ఒక తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు. అయితే తెలుగు ప్రేక్షకుల దురదృష్టమో ఏమో కానీ.. ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ 4 ఎవర్ అనే సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించారు. అయితే ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీపికా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా ఉపేంద్ర సరసన కూడా హీరోయిన్గా నటించింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పుడు అయితే షారుక్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం సినిమా చేసిందో ఆ సినిమాతో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. ఆ సినిమా రాత్రికి రాత్రే ఆమెను స్టార్ హీరోయిన్ను చేసేసింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆమె బాలీవుడ్ నటుడు రణవీర్‌సింగ్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది.