టాలీవుడ్‌లో వరుస మ్యూజికల్ హిట్లతో థమన్ కెరీర్ దూసుకు పోతోంది. మీడియం రేంజ్ సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు థమన్‌కు వరుస బ్లాక్‌బస్టర్ హిట్లు వస్తున్నాయి. అసలు థమన్ షెడ్యూల్ ఖాళీ లేకుండా ఉంది. ఇంత బిజీగా ఉన్న థమన్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువే. థమన్ చిన్న సినిమా నుంచి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాల వరకు ఒక్కో సినిమాకు రు 2.5 కోట్ల నుంచి రు. 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
థమన్ మ్యూజిక్ కాని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాని దుమ్ము దులిపేస్తూ ఉంటుంది. అల వైకుంఠపురంలో సినిమా ఆ రేంజ్‌లో హిట్ అవ్వడానికి కాని.. రిలీజ్‌కు ముందే ఆ స్థాయిలో బజ్ ఊపేయడానికి కాని థమన్ అందించిన మ్యూజిక్ ప్రధాన కారణం అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న వార్తలపై కూడా థమన్ స్పందించారు.
తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలేమి ఫుల్స్ కాదని.. తన మ్యూజిక్‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో అంతే స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తారని థమన్ చెప్పారు. ఇక తనకు ఇచ్చే రెమ్యునరేషన్ అంతా తనకే రాదని.. మొత్తం రెమ్యునరేషన్‌లో 50 శాతం మాత్రమే తనకు వస్తుందని చెప్పాడు. మిగిలిన 50 శాతం సౌండ్ ఇంజనీర్లు, ప్రొఫెషనల్ మ్యూజిక్, ఇన్‌స్ట్రమెంట్స్ ప్లేయర్స్‌తో పాటు సింగర్లు ఇలా వీళ్లందరికి వెళ్లిపోతుందని థమన్ చెప్పాడు.
ఇక థమన్ ప్రస్తుతం క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్స్‌తో ఉన్నాడు. థమన్ మ్యూజిక్ ఇచ్చిన అఖండ డిసెంబర్ 2న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ భీమ్లా నాయక్, మహేష్‌బాబు సర్కారువారి పాట సినిమాలకు కూడా థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమాల ఆడియోలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.