నందమూరి తారక రామారావు.. సినీ ప్రపంచంలో ఈయన ఒక అద్భుతం. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ఎంజీఆర్ ఎలా అయితే గుర్తింపు పొందారో.. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందడం గమనార్హం. ప్రతీ సినీ ఇండస్ట్రీలో ఒక మహనీయుడు ఉన్నట్టుగానే తెలుగు చిత్ర పరిశ్రమను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావడానికి కారణం నందమూరి తారక రామారావు. ఇటు సినిమాల పరంగా, అటు రాజకీయ పరంగా.. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈయన నిజ జీవితంలో ఎంతవరకు ఆస్తులు కూడబెట్టారు అనే విషయాలు మాత్రం చాలామందికి తెలియదు.
మధ్య తరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ సినిమాల కోసం హైదరాబాదుకు వచ్చి తన స్వార్జితంతో కోట్ల రూపాయలు కూడా పెట్టారు. ఎన్టీఆర్ కు రాయలసీమ దుర్భిక్ష నిధి సేకరణ నాటినుంచి అప్పటి ముఖ్యమంత్రి విజయ భాస్కర్ రెడ్డితో ఆత్మీయ అనుబంధం ఎక్కువగా ఉండేది. విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ హైదరాబాద్లో ఆస్తులు కూడపెట్టడం మొదలుపెట్టారు. మొదటి సారి ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రాంతం కొనడం మొదలు పెట్టారు.
రామకృష్ణ థియేటర్ ని ఎంతో ముచ్చటపడి నిర్మించడం జరిగింది. థియేటర్ పక్కనే ఉన్న బార్ తో పాటు కొన్ని ఆస్తులను కూడా అక్కడ కొన్నారు. ఇప్పుడు వీటి విలువ కోట్లలోనే ఉంటుంది. గ్రామాల నుంచి హైదరాబాద్ కు ఎవరు వచ్చినా సరే ఎన్టీఆర్ ఎస్టేట్ ఒక సందర్శనీయ ప్రదేశం. ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, రామకృష్ణ జంట థియేటర్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ ఎస్టేట్లో భాగాలే. ఎన్టీఆర్ కు ఒక కోరిక ఉండేది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన థియేటర్ ను నిర్మించాలని.. కానీ కొన్ని కారణాల చేత ఆగిపోయిన ఆ నిర్మాణం..ఆ తర్వాత పలు నగరాలలో చేపట్టడం జరిగింది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన నగరాలలో థియేటర్లు నిర్ణయించడం , ఖరీదైన స్థలాలను కొనడం జరిగింది. ముషీరాబాద్ లోని రామకృష్ణ థియేటర్, కాచిగూడ చౌరస్తాలోని తారక రామా థియేటర్, మాసబ్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన ఐదు స్వతంత్ర భవనాలు, ఇలా సినిమాలలో సంపాదించిన ధనాన్ని అంతా బంగ్లాలు, థియేటర్లను కొనుగోలు చేయడానికి వెచ్చించారు. అంతేకాదు ఆయన కొనుగోలు చేసిన ఐదు భవనాలలో ఆయన ఐదుగురు కుమారుడు ఉంటున్నారు.
చిట్టచివరిగా ఆయన కాపురమున్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఇంటిని తన రెండవ భార్య లక్ష్మీపార్వతి పేరున మార్చేశారు. అంతేకాదు ఆ ఇంటికి పడమర వైపున ఉన్న ప్రాంతాన్ని, ఎదురుగా గుట్టపై మ్యూజియం కోసం ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాన్ని కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేశారు. గండిపేట ఆశ్రమం ,తెలుగు విజయం భూములను కూడా ఈయన కొనుగోలు చేశారు.
నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో వున్న పొలాన్ని మాత్రం రాజకీయాల్లోకి రాకముందు సినిమాలలో వచ్చిన డబ్బుతో కొనుగోలు చేశారు. సొంత కష్టార్జితంతో ఆయన కొనుగోలు చేసిన ఆస్తులన్నీ కాలక్రమేణా కోట్లు పలకడం మొదలు పెట్టాయి. నిజానికి ఆయన ఆస్తుల వివరాల విషయానికి వస్తే లెక్కపెట్టలేనంతగా మారి పోవడం గమనార్హం.
ఇక సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కు రాకముందే చెన్నైలో ఆయన కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారు. అప్పట్లో ఆయన చాలా తక్కువ రేట్లలోనే వాటిని కొన్నారు. అయితే ఇప్పుడు వాటి విలువ కోట్లలోనే ఉంటోంది. ఎన్టీఆర్ తన సంపాదన అంతా అందరు కుమార్తెలు, కుమారులకు పంచారు.