Moviesయాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే...!

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే…!

ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై నిజంగా ఓ సంచ‌ల‌నం అని చెప్పాలి. తన యాంకరింగ్ ద్వారా ఎన్నో సరికొత్త సంచలనాలకు నాందిపలికిన ప్రదీప్ ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు అని చెప్పాలి. ప్రదీప్ షో వస్తుందంటే చారు ఎంతో మంది అమ్మాయిలే కాకుండా ఆంటీలు కూడా ఎగబడి చూస్తుంటారు ప్రదీప్ అత్త‌లు, కోడ‌ళ్ల‌తో చేసే షోల‌కు అయితే తెలుగునాట మామూలు క్రేజ్ లేదు. ప్ర‌దీప్ షోలు మిట్టమధ్యాహ్నం టీవీలో వచ్చినా కూడా టీఆర్పీలో దుమ్ముదులిపేస్తూ ఉంటాయి.

ఒక రకంగా చెప్పాలంటే ప్రదీప్ బుల్లి తెరపై తిరుగులేని సూపర్‌స్టార్ అని చెప్పాలి. ప్రదీప్ రెమ్యున‌రేష‌న్ గంట‌కు వేలల్లోనే ఉంటుంది. వెండి తెరపై సైతం స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా వెండి తెరపై తళుక్కున మెరిశారు. బుల్లితెర‌పై ప్ర‌దీప్ నిజంగా ఓ సూప‌ర్ స్టారే. ఆ రేంజ్‌లో అత‌డికి అభిమాన గ‌ణం ఉంది.

అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాలో ఒకే ఒక్క సాంగ్ తో సోషల్ మీడియా ను షేక్ చేసి పారేశారు. ప్రదీప్ ఫ్యామిలీ విషయానికొస్తే తల్లి గృహిణి… ప్రదీప్ తండ్రి సీఏ చ‌దివారు. ఏపీలో కోనసీమలోని అమలాపురం ప్రదీప్ స్వస్థలం. ప్రదీప్ పుట్టింది అమలాపురంలో అయినా పెరిగింది అంతా హైదరాబాద్ లోనే..!

ప్ర‌దీప్ తండ్రి హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయ‌లు కూడ‌బెట్టార‌ట‌. ఆయ‌న సీఏగా ఇటీవ‌లే రిటైర్ అయ్యారు. ఇక తాను కోనసీమలో గోదావరి నీళ్లు తాగడంతో కాస్త వెటకారం పాళ్లు త‌న మాట‌ల్లో ఎక్కువగానే ఉంటుందని ప్రదీప్ జోక్ చేస్తూ ఉంటాడు. ఇక ప్ర‌దీప్ హీరోగా మ‌రికొన్ని ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయ‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news