టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఐదు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో కొనసాగుతున్నారు. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరున్న రాఘవేంద్రరావు టాలీవుడ్లో స్టార్ హీరోలు ఎన్టీఆర్ నుంచి నేటి తరం హీరోలు మంచు మనోజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్‌కు సైతం సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. రాఘవేంద్రరావు అంటే అందరు హీరోలకు ఎంతో గౌరవం.
సీనియర్ ఎన్టీఆర్ సైతం రాఘవేంద్రరావుని ఎంతో ప్రేమతో బ్రదర్ అని పిలిచేవారు. అలాంటి రాఘవేంద్రరావును ఓ స్టార్ హీరో ఆయనకు పొగరు, అహంకారం ఎక్కువ అని ఆయన ముందే అన్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. మోహన్‌బాబు – రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.
రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఎన్నో పాత్రల్లో నటించారు మోహన్ బాబు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహబలుడు సినిమాకు రాఘవేంద్రరావు దర్శకుడు. ఆ సినిమాకు కోదండరామిరెడ్డి అసిస్టెంట్ దర్శకుడు. ఎన్టీఆర్ తో ఒక సన్నివేశంలో మోహన్ బాబు నటించాల్సి ఉంది.
ఆ ఫైటింగ్ సీన్ లో ఎన్టీఆర్.. మోహన్ బాబు తలపై ఉన్న కిరీటంని కొట్టాలి. ఆ కిరీటాన్ని ఎన్టీఆర్ గట్టిగా కొట్టడంతో మోహన్ బాబు కన్ను వాచి పోయిందట. దీంతో ఎన్టీఆర్ తో నటించే సన్నివేశాల్లో తాను చేయలేని డూప్‌ను పెట్టుకోవాలని కోదండరామిరెడ్డి చెప్పారట.
అయితే కోదండరామిరెడ్డి ఈ విషయాన్ని రాఘవేంద్రరావుకు చెప్పినా ఆయన లైట్ తీసుకున్నారు. మోహన్ బాబు మాత్రం డూప్‌తోనే చేయించుకోమని కోదండరామిరెడ్డికి గట్టిగా చెప్పారట. అప్పుడు కోదండరామిరెడ్డి ఆవేశం పట్టలేక తలపై ఉన్న టోపీ తీసి విసిరి కొట్టాడట. మోహన్ బాబు సైతం కోపంతో తన తలపై ఉన్న కిరీటాన్ని నేల మీద విసిరి కొట్టారట.
అదే రోజు రాత్రి రాఘవేంద్రరావు మోహన్ బాబుతో ఇంత గర్వం ఏంటయ్యా ? పైకి రావలసిన వాడివి అని అని చిన్న వార్నింగ్ ఇచ్చారట. అయితే రాఘవేంద్రరావు స్వరాభిషేకం కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ అప్పట్లో రాఘవేంద్రరావుకు వరుస సక్సెస్‌లతో పొగరు ఎక్కువగా ఉండేదని చెప్పేశారు. అయితే రాఘవేంద్రరావు మాత్రం… తనకు అవి లేవని కోపం మాత్రమే ఎక్కువ అని చెప్పారు.