ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ శ్రేణులు ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కుప్పం వెళ్లినప్పుడే ఆయన మీటింగ్‌లోనే రెండు సార్లు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు గట్టిగా వినపడ్డాయి. సరే ఎన్టీఆర్ ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తాడా ? రాడా ? అన్నది పక్కన పెడితే ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది.
ఇక ఇటీవల పలు సర్వేలు నెక్ట్స్ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరు ? ఉండాలని జరుగుతున్నాయి. ఈ సర్వేల్లో ఎక్కువ మంది ఎన్టీఆర్ పేరే చెపుతున్నారు. దీనిపై జరుగుతోన్న ఆన్‌లైన్ సర్వేల్లో కూడా ఎన్టీఆర్‌కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఇక రాజగురువు రామోజీరావు సైతం జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకుని ఏదో ఒక కీలక పదవి అప్పగిస్తే పార్టీకి మరింత ఊపు వస్తుందని చంద్రబాబుకు చెప్పినట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మరి చంద్రబాబు నిర్ణయం ఏంటనేది కూడా అంతు పట్టడం లేదు.
ఎన్టీఆర్‌కు యూత్‌లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయంలో ఆయనకు తిరుగులేదు. అయితే ఇప్పుడు సినిమా పరంగా కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇలాంటి టైంలో మంచి భవిష్యత్తును వదులుకుని రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చేస్తాడని ఆశించలేం. 2009 ఎన్నికల కోసం మాత్రం చంద్రబాబు ఒత్తిడితో ఎన్టీఆర్ బయటకు వచ్చి పరిచయం చేశారు. అయితే కొద్ది రోజుల ప్రచారం తర్వాత ఎన్టీఆర్ యాక్సిడెంట్‌కు గురవ్వడంతో ఆ ప్రచారం మధ్యలోనే ఆగిపోయింది.
మరి ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన ఘటనపై కూడా స్పందించి.. తాను ఎప్పుడూ కుటుంబం వైపే ఉంటానని హింట్ ఇచ్చారు. మరి తాత స్థాపించిన పార్టీ కష్టాల్లో ఉంది. ఈ పార్టీ కోసం ఎన్టీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడు ? అనేది కాలమే నిర్ణయించాలి.