తెలుగు సినిమా రంగంలో సీనియర్ హీరోగా ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగానే కాకుండా విలన్‌గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మోహన్ బాబుకు మంచి క్రమశిక్షణ కల నటుడు అన్న పేరు ఉంది. మోహన్ బాబు సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎన్టీఆర్ ప్రోత్సాహం మేరకు రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే గత సాధారణ ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే.
మోహన్ బాబు నట వారసులుగా ఆయన ఇద్దరు కుమారులు విష్ణు , మనోజ్‌తో పాటు కుమార్తె లక్ష్మీ ప్రసన్న సైతం సినిమాల్లోకి వచ్చారు. లక్ష్మీ ప్రసన్న బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకుంటున్నారు. మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు ఎవరు కూడా ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ విషయానికొస్తే ఆయన ఫ్యామిలీకి మొదటి పెళ్లి అనేది పెద్దగా కలిసి రాలేదు. మోహన్‌బాబు ముందుగా విద్యావతిని పెళ్లి చేసుకున్నారు.
విష్ణు, లక్ష్మీ ప్రసన్న పుట్టిన తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయి. మోహన్ బాబు కెరీర్ లో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న కారణంతో విద్యాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత తన గురువు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో తన భార్య చెల్లి, తన మరదలు అయిన నిర్మలాదేవి రెండో పెళ్లి చేసుకున్నారు. మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్నకు సైతం ముందుగా ఒక వ్యక్తి తో పెళ్లి జరిగిందని అంటారు. అతడితో విభేదాలు రావడంతో విడిపోయింది.
ఆ తర్వాత మోహన్ బాబు చెన్నైకి చెందిన వ్యక్తితో ఆమెకు మళ్లీ వివాహం జరిపించారు. లక్ష్మీ ప్రసన్న భర్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. లక్ష్మి మొదటి భర్త పేరు మ్యాండీ శ్రీనివాస్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో ప్రస్తావించారు. ఇక మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఏదేమైనా మోహన్‌బాబు ఫ్యామిలీలో ఏకంగా ముగ్గురికి మొదటి పెళ్లి కలిసి రాలేదు.