తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని దశాబ్దాల్లో ఎంతమంది కమెడియన్లు వచ్చినా కూడా బ్రహ్మానందం క్రేజ్, పొజిషన్ ఎవ్వరికి రాలేదు. బ్రహ్మానందం నాటి తరం స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఆ తర్వాత సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ నుంచి ఈ తరం హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు ప్రతి ఒక్క తరంలోని స్టార్ హీరోతో కలిసి తనదైన స్టైల్లో కామెడీ పండించారు. బ్రహ్మీ తెరమీద కనిపిస్తే చాలు నవ్వుల వర్షం కురవాల్సిందే..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ కమెడియన్‌కు సాధ్యం కాని విధంగా 1000కు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం వల్లే చాలా సినిమాలు హిట్ అయ్యాయంటే నమ్మాల్సిందే. అసలు ఒకానొక టైంలో బ్రహ్మానందం లేకపోతే తెలుగు సినిమా లేదు అన్నట్టుగా ఆయన ఫామ్ కొనసాగింది. ఒకానొక టైంలో బ్రహ్మానందం నటించిన సినిమాలు యేడాదికి పదుల సంఖ్యలో రిలీజ్ అయ్యేవి.
ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు రోజుకు రు. 5 – 10 లక్షల మధ్యలో సినిమా రేంజ్‌ను బట్టి రెమ్యునరేషన్ అందుకునేవారట. ఇలా ఫుల్ బిజీగా ఉంటూ ఆయన సంపాదించిన ఆస్తి టాప్ హీరోల ఆస్తితో కాస్త అటూ ఇటూగా సమానంగా ఉందని చెపుతుంటారు. అయితే ఇప్పుడు వయస్సు పై బడడంతో బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించేశారు. ఇప్పుడు వయస్సు పై బడినా కూడా ఆయన రోజుకు రు. 5 లక్షలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.