ప్రభాస్ అభిమానులు ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న రాను రోజే వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జిల్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రెండు దశాబ్దాల క్రితం యూరప్‌లో జరిగిన ఓ ప్రేమకథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
ప్రేమకథతో పాటు యాక్షన్, ఎమోషన్ అన్ని కలగలిపి రాధాకృష్ణ ఈ సినిమను తెరకెక్కిస్తున్నాడట.కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ నటిస్తోంది. ఈ సినిమా అప్డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూశారు.
వారి నిరీక్షణకు తెరదించుతూ మంచి ప్రేమ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ రాతలే అంటూ రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మేకర్లు. అయితే సాయంత్రం ఐదు గంటలకు ఇవ్వాల్సిన ఈ అప్డేట్.. దాదాపు తొమ్మిది గంటలకు ఇచ్చారు. ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అయితే యానిమేషన్లా చూపించడంతో ప్రభాస్, పూజా హెగ్డేలు ఈ లిరికల్ వీడియోలో స్పష్టంగా కనిపించలేదు. ఎవరో వీరెవరో ’అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. టోటల్ గా ఈ సినిమాలో మ్యూజిక్ కన్నా కూడా బ్యాక్ గ్రౌండ్ లోకేషన్స్ బాగున్నాయి అని అంటున్నారు.