Moviesతండ్రి ఒక్కటే కానీ తల్లులు వేరుగా ఉన్న ఈ స్టార్ హీరోస్...

తండ్రి ఒక్కటే కానీ తల్లులు వేరుగా ఉన్న ఈ స్టార్ హీరోస్ ఎవరో తెలుసా..?

భారత రాజ్యాంగం ప్రకారం ఒకటే పెళ్లి , ఇద్దరే పిల్లలు అనే చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే కానీ.. మొదటి భార్య చనిపోతే లేదా మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తరువాత అతడికి లేదా ఆమెకి రెండో వివాహం చేసుకునే అధికారం కూడా ఉంటుంది అని తీర్పునిచ్చింది. అయితే ఇది సామాన్య ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే పౌరులందరికీ వర్తిస్తుంది. కాబట్టి స్టార్ట్ సెలబ్రిటీలు కూడా రెండు వివాహాలు చేసుకుని పిల్లల్ని కని వారిని స్టార్ సెలబ్రెటీలుగా తీర్చిదిద్దారు. అలా సూపర్ స్టార్ కృష్ణ ను మొదలుకొని కింగ్ నాగార్జున వరకు చాలామంది స్టార్ హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కని, వారిని కూడా స్టార్ హీరోలుగా తీర్చిదిద్దారు.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలకు తండ్రి ఒక్కడే అయినా తల్లులు మాత్రం వేరు. అయితే ఎవరెవరు ఆ స్టార్ హీరోలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. నాగర్జున – నాగ చైతన్య , అఖిల్:
ఆరు పదుల వయసు వస్తున్నా ఇంకా నవమన్మధుడు గా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున. మొదటిసారి ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకొని నాగచైతన్యకు జన్మనిచ్చారు. ఇక ఆ తర్వాత లక్ష్మీ తో విడాకులు తీసుకొని అమలను వివాహం చేసుకున్నాడు నాగార్జున. ఇక వీరికి అక్కినేని అఖిల్ జన్మించాడు.

2. సూపర్ స్టార్ కృష్ణ – మహేష్ బాబు, నరేష్:
కృష్ణ తన మొదటి భార్య ఇందిరా తో మహేష్ బాబు కు జన్మనివ్వడం జరిగింది. కానీ కృష్ణ రెండవ భార్య విజయనిర్మల కు నరేష్ జన్మించాడు.

3. హరికృష్ణ- జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్:
హరికృష్ణ మొదటి భార్యకు కళ్యాణ్ రామ్, జానకిరామ్ జన్మించగా, రెండవ భార్య షాలిని కి జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.

4. విజయ్ కుమార్ -అరుణ్ విజయ్ ,శ్రీదేవి:
సీనియర్ నటుడు విజయ్ కుమార్ మొదటి భార్యకు అరుణ్ విజయ్ జన్మించగా, ఆయన రెండవ భార్య ప్రముఖ నటి అంజలికి జూనియర్ శ్రీదేవి జన్మించింది.

5. నగ్మా – జ్యోతిక:
సౌత్ సినీ ఇండస్ట్రీలో తమాకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నగ్మా , జ్యోతిక ఇద్దరు కూడా అక్క చెల్లెలు అన్న విషయం చాలా మందికి తెలియదు.కానీ వీరిద్దరికీ తండ్రి ఒక్కరే కానీ తల్లులు మాత్రమే వేరు..

6. బోనీ కపూర్- అర్జున్ కపూర్ , జాన్వీకపూర్:
నటుడు, నిర్మాత, దర్శకుడిగా గుర్తింపు పొందిన బోనీ కపూర్ తన మొదటి భార్య మోనా శౌరే కపూర్ కి అర్జున్ కపూర్ జన్మించగా, రెండవ భార్య శ్రీదేవి కి జాన్వి కపూర్, ఖుషి కపూర్ లు జన్మించారు.

7. మోహన్ బాబు- మంచు విష్ణు , మంచు మనోజ్:
మోహన్ బాబు మొదటి భార్య మంచు విష్ణు , లక్ష్మీ లు జన్మించగా, రెండవ భార్యకు మంచు మనోజ్ జన్మించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news