అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల కలల రాకుమారుడు. ఆయనో కింగ్, ఓ మన్మథుడు. 1980 -90వ దశకంలో నాగార్జునకు విపరీతంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. నాగార్జున స్టైల్‌కు అమ్మాయిలు పడిపోయేవారు. నాగార్జున సినిమా వస్తుందంటే చాలు తొలి రోజు అమ్మాయిలు కూడా కాలేజ్‌లు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవారు. అయితే నాగార్జున అంటే హీరోయిన్లలో కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. నాగ్ పక్కన ఒక్క సినిమాలో అయినా నటించేందుకు హీరోయిన్లు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేసేవారు.
ఈ క్రమంలోనే నాగార్జునకు కొంత మంది అమ్మాయిలతో ఎఫైర్లు ఉండేవన్న వార్తలు కూడా ఎక్కువుగా వినిపించేవి. ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ టబు పేరు కూడా ఎక్కువుగా వినిపించేది. టబు – నాగార్జున మధ్య ఎఫైర్ ఉండేదని.. టబు నాగార్జున అంటే ఎంతో ఇష్టంతో ఉండేదని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ వినిపించేది. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమాలో వీరు మొదటి సారిగా కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత ఆవిడా మాఆవిడే సినిమాలో మరోసారి జోడీ కట్టారు. అప్పటి నుంచి కూడా నాగార్జున మీద ప్రేమతోనే టబు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందని అంటారు. ఆమె హైదరాబాద్‌లోనే ఉంటోందని చెపుతుంటారు. ఏదేమైనా అమల గ్రిప్పింగ్ వేరు. నాగార్జునపై ఎన్ని రూమర్లు వచ్చినా తన భర్తను ఎలా కంట్రల్లో పెట్టుకోవాలో బాగా తెలిసిన మనిషి అంటారు. నాగ్ ఫిజిక్ ఇప్పటకీ యంగ్‌గానే ఉందంటే అందుకు అమల తీసుకున్న జాగ్రత్తలే కారణం.
ఇక టబు – నాగార్జున మధ్య పుకార్లు ఓ దశలో ఎక్కువుగా వినిపించడంతో అమల స్పందించారు. టబు తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. అసలు ఈ గాసిప్‌లు పుట్టించేవాళ్లు ఎందుకు ఇలా ? చేస్తారో ? అని అమల అసహనం కూడా వ్యక్తం చేసింది. టబు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉంటుందని.. ఆమె తనకు మంచి స్నేహితురాలే అని ఆ పుకార్లుకు ఫుల్స్టాప్ పెట్టేసింది.