Moviesక్రేజీ బ్యూటీ హాట్ కామెంట్స్..రష్మిక మందన కోరికలు భలే ఉన్నాయే..!!

క్రేజీ బ్యూటీ హాట్ కామెంట్స్..రష్మిక మందన కోరికలు భలే ఉన్నాయే..!!

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. వరుస ఆఫర్ లతో తన ఖాతా నింపుకుంటుంది. ‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది కన్నడ భామ రష్మిక మందన. ”గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు భీష్మ” లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ కన్నడ బ్యూటీ. లవ్, డేటింగ్, బాయ్స్ గురించి మాట్లాడింది. తన డేటింగ్ లైఫ్ గురించి చెప్పుతుయ్.. ఒక బాయ్‌ని చూడగానే డేటింగ్ మొదలైందని అనుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన ఫ్రెంద్స్ ఆ వ్యక్తి పేరు చెప్పి తనన్ను ఆటపట్టించేవారట. తన దృష్టిలో వయసు అనేది చాలా చిన్న విషయం..అది అసలు మ్యాటరే కాదు అంటూ.. వయసు గురించి గురించి నేను పట్టించుకోను అని చెప్పేసింది.

అంతేకాదు తనకి వర్కౌట్లు చేస్తూ ఫిట్‌గా ఉండే వ్యక్తులు అంటే చాలా ఇష్టం అని చెప్పుకోచ్చింది. అబ్బాయిలు వ‌ర్క‌వుట్ చేస్తూ క‌ష్ట‌ప‌డి ఫిట్‌గా క‌నిపించడాన్ని నిజంగా అభినందిస్తున్నా.వారు ప‌డ్డ‌ క‌ష్టం వాళ్లు ఎంత అంకిత‌భావంతో ఉన్నార‌నేది తెలియ‌జేస్తుందంటూ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక పుష్ప‌లో బన్నీ పక్కన హీరోయిన్ న‌టిస్తోంది. డిసెంబ‌ర్ 17న క్రిస్ మస్ సధ్రభంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుందీ . మ‌రోవైపు శ‌ర్వానంద్‌తో క‌లిసి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమా కూడా చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news