ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల పాటు ఓ సినిమా చేసినా కూడా ఎందుకో గాని ప్రేక్షకులను మెప్పించలేం. ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది. సినిమా చాలా బాగుందిరా అని చెపుతాము.. అయినా ఆ సినిమాను ఎందుకో గాని ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారు. ఇందుకు సరైన టైంలో రిలీజ్ కాకపోవడమే లేదా మరేదైనా కారణమా ? అన్నది తెలియదు. మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు అలాగే ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాయి.
ఖలేజా : మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబోలో రెండో సినిమాగా వచ్చిన ఖలేజా భారీ అంచనాలతో వచ్చింది. సినిమా బాగుంటుంది. కానీ ఎందుకో గాని ప్రేక్షకులు తిరస్కరించారు. వెండితెరపై డిజాస్టర్ అయిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ఎప్పుడు వచ్చినా టాప్ టీఆర్పీతో దుమ్ము రేపుతుంది.
ఇక ముగ్గురు స్నేహితుల కథ ఆథారంగా వచ్చిన శంభో శివ శంభో కూడా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఎవ్వరికి తెలియదు. ఈ సినిమా కథ బాగున్నా , విమర్శకుల ప్రశంసలు వచ్చినా కమర్షియల్‌గా ప్లాప్ అయ్యింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ అయ్యింది.
రిలీజ్‌కు ముందే హరీష్ జైరాజ్ అందించిన స్వరాలు ఇప్పటకీ కొత్తగానే ఉంటాయి. ఇక నాని నటించిన పిల్ల జమిందార్, జెర్సీ సినిమాలు కూడా బాగున్నా కమర్షయిల్‌గా హిట్ కొట్టలేకపోయాయి. అలాగే ఘాజీ, నాగార్జున గగనం మంచి సబ్జెక్ట్ సినిమాలే అయినా ప్లాప్ అయ్యాయి. అలాగే అందాల రాక్షసి, మహేష్‌బాబు వన్, గోపీచంద్ సాహసం సినిమాలు బుల్లితెరపై చూస్తుంటే అసలు ఈ సినిమాలు ఎందుకు ఆడలేదో ? ఎవ్వరికి అర్థం కాదు.. కానీ ఇవి వెండితెరపై ప్లాప్ అయ్యాయి.