విక్టరీ వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇందులో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సినిమాను పదే పదే చూడడంతోనే చాలా చోట్ల 200 రోజులు కూడా ఆడింది. ఈ సినిమాలో వెంకీ రెండో భార్య మనీషాగా వినీత నటించింది.
ఆమె అప్పటికే కోలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్. ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత ఆమె ఒక రోజు చెన్నై సమీపంలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి పోయింది. రెడ్ హ్యాండెడ్‌గా వినీత దొరికిపోవడం అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లారు. కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది.
ఒక్కసారిగా సినిమా ఛాన్సులు ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతోనే ఇలా వ్యభిచారంలోకి దిగి డబ్బులు సంపాదించాలని అనుకుందన్న ప్రచారం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చాక వినీతకు చాలా రోజులు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె వెయిట్ పెరిగిపోవడంతో ఆమెకు ఛాన్సులు రాకుండా పోయాయి. అయితే డబ్బుపై ఉన్న వ్యామోహంతోనే వినీత ఇలా అడ్డదారులు తొక్కి కెరీర్ నాశనం చేసుకుందన్న విమర్శలు అయితే ఆమెపై ఉన్నాయి.