తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఆయనకు కోపం వచ్చినా వెంటనే ఓపెన్ అయిపోతారు. ఆనందం వచ్చినా చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేస్తారు. రాజశేఖర్ క్రమశిక్షణకు మారుపేరు.. ఇతరు విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. ఆయన ఎవరికి అయినా తనకు తోచిన సాయం చేస్తారు. చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్‌కు గరుడవేగ సినిమాతో మంచి హిట్ వచ్చింది. ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ఈ సినిమా రాజశేఖర్ కెరీర్‌కు మంచి ఊపిరిలూదింది.
ఇక రాజశేఖర్ స్వతహాగా వైద్యుడు కావడంతో ఇండస్ట్రీలో ఎంతో మంది పేదలకు ఆయన ఫ్రీగా వైద్యం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ రోజు సునీల్ కుమార్తె తీవ్ర అనారోగ్యం పాలైందట. ఆ సమయంలో రాజశేఖర్ అత్యవసర పరిస్థితుల్లో ఆ పాపకు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి బయట పడేశారట. ఈ విషయాన్ని సునీల్ స్వయంగా చెప్పారు.
ఓ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ రాజశేఖర్ పేరు తలచుకుని ఎమోషనల్ అయిపోయాడు. రాజశేఖర్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆయన వ్యక్తిగతంగా కూడా తనకు ఎంతో సాయం చేశారని సునీల్ చెప్పాడు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో తన కూతురు ప్రాణాలు కాపాడాడని రాజశేఖర్ ను ప్రశంసించారు. ఇక గతంలో రాజశేఖర్ – జీవిత దంపతులు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. సునామీ వచ్చినప్పుడు వీరు సొంతంగా రు. 30 లక్షల వలలను మత్స్యకారులకు అందజేశారు.