Moviesఒకే క‌థ‌తో మ‌హేష్ సినిమా హిట్టు... బాల‌య్య సినిమా ప్లాపు...!

ఒకే క‌థ‌తో మ‌హేష్ సినిమా హిట్టు… బాల‌య్య సినిమా ప్లాపు…!

స‌రిగ్గా ఐదేళ్ల క్రితం టాలీవుడ్‌ను ఉర్రూత‌లూగించేసింది శ్రీమంతుడు సినిమా. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న మ‌హేష్‌బాబుకు కొర‌టాల శివ అదిరిపోయే బ్లాక్ బస్ట‌ర్ ఇచ్చాడు. అప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఉన్న పాత సినిమాల‌కు పాత‌రేసి మ‌రీ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సంపాదించిన దానిలో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేక‌పోతే లావెక్కిపోతాం అన్న డైలాగ్ అప్ప‌ట్లో బాగా పాపుల‌ర్ అయ్యింది.

మ‌నం మ‌న సొంత ఊరుకు ఏదైనా చేయాల‌న్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. శ్రీమంతుడు త‌ర్వాతే రెండు తెలుగు రాష్ట్రాల్లో సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకునే కార్య‌క్ర‌మం బాగా హైలెట్ అయ్యింది. అయితే ఇదే క‌థాంశంతో సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఓ సినిమా చేశాడు. 1984లో క‌ళా త‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా జ‌న‌నీ జ‌న్మ‌భూమి సినిమా వ‌చ్చింది.

ఈ సినిమాలో హీరో పాత్ర పేరు ర‌మేష్‌. కోట్ల‌కు అధిపతి అయినా కూడా ఈ క్ర‌మంలోనే హీరోయిన్ ప‌ద్మిని వ‌ల్ల ఆ ఊరుకు వెళ్లి అక్క‌డ ఆ గ్రామ‌స్తులు ప‌డుతున్న బాధ‌లు చూసి వాళ్ల‌కు అండ‌గా నిల‌వాల‌ని అనుకుంటాడు. అక్క‌డ హీరో చేసే ప్ర‌తి పనికి విల‌న్ అడ్డు ప‌డుతూ ఉంటాడు. కొడుకు త‌మ‌ను వీడి వెళ్లిపోయాడ‌న్న ఆవేద‌న‌తో హీరో కుటుంబం ఉంటుంది.

ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తుంటే కాస్త అటూ ఇటూగా శ్రీమంతుడు లైన్‌నే పోలి ఉంది. విశ్వ‌నాథ్ గారు ఎంతో మంచి స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కించినా కూడా ప్లాప్ అయ్యింది. నంద‌మూరి మార్క్ మాస్ మ‌సాలా ఎలిమెంట్స్, డైలాగులు లేక‌పోవ‌డం కూడా ఈ సినిమా ప్లాప్‌కు మ‌రో కార‌ణం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news