తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాదు. విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ సినీ ఇండస్టృఈలో విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న కోలీవుడ్ హీరో. ఏ పాత్రను అయినా ఆయన అలవోకగా పోషిస్తారనే పేరుంది. కేవలం తమైళంలోనే కాదు తెలుగులోను నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమాలో తన నట విశ్వ రూపాన్ని చూపించి ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చేతనే శభాష్ అనిపించుకున్నారు.
అయితే రీసెంట్ గా బెంగళూరు ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఏవ్రో ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి విజయ్ సేతుపతి వెనక నుంచి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్న సెక్యూరిటి అలర్ట్ అయ్యి..ఆయనకు కాపాడారు. ఇక్కడ షాకింగ్ ఏమితంటే విజయ్ చుట్టూ భద్రత సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విజయ్ సేతుపతిపై దాడి జరగడంతో ఒక్కసారిగా ఆయన షాక్కు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని విజయ్ సేతుపతి వదిలేశారు.
తాజాగా హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించి సంచలనానికి తెర లేపింది.విజయ్ సేతుపతి స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్య మరియు దేశాన్ని అవమానించాడని వీడియో ఒక దానిని పోస్ట్ చేసింది. అలా “తేవర్ అయ్యను అవమానించినందుకుగాను ఎవరైతే నటుడు విజయ్ సేతుపతిని తన్నుతారో, వారికి బహుమతి ఉంటుందని పేర్కొంది.
Arjun Sampath announces cash award, for kicking actor Vijay Sethupathi for insulting Thevar Ayya.
1 kick = Rs.1001/- for any one who kicks him, until he apologises. pic.twitter.com/Fogf7D9V7S
— Indu Makkal Katchi (Offl) 🇮🇳 (@Indumakalktchi) November 7, 2021
హిందూ మతతత్వ సంస్థ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్ మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూ మక్కల్ కట్చి అనే ఆర్గనైజేషన్ విజయ్ సేతుపతిని కొట్టిన వారికి 1001 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తామంటూ ఆ సంస్థ చీఫ్ అ ర్జున్ సంపత్ నగదు బహుమతి ప్రకటించారు.అతను క్షమాపణ చెప్పే వరకు తన్నాలని కూడా వారు పేర్కొన్నారు.